కష్టాలు తీరతాయా: జ్యోతిష్యులను అడిగిన జగన్
posted on Jul 1, 2016 @ 11:00AM
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహనరెడ్డికి రేపు ఏమౌవుతుందోనన్న భయం పట్టుకుంది. తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్, ఎమ్మెల్యేల ఫిరాయింపులు, జనం నుంచి ఆదరణ కరువు ఇలా వరుస సమస్యలు ఆయన్ను చుట్టుముట్టాయి. ఈ టెన్షన్‌ల నుంచి కాస్త రిలీఫ్ అవుదామని ఫ్యామిలీతో ఫారిన్ టూర్ వెళ్లి వచ్చిన జగన్‌కు వచ్చి రాగానే ఈడీ తనదైన స్టైల్లో గ్రాండ్ వెల్‌కమ్ చెప్పింది. జగన్‌కు చెందిన దాదాపు రూ.750 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. దీంతో జగన్‌కు భయం పట్టుకుంది. ఈ కష్టాలు తీరతాయా.? లేదంటే మరింత ఎక్కువవుతాయా..? అన్నది తెలుసుకోవడానికి ఆయన జ్యోతిష్యులను సంప్రదించారట. తన పర్యటన కార్యక్రమాన్ని రద్దు చేసుకుని లోటస్‌పాండ్‌లోని తన నివాసానికి ప్రముఖ జ్యోతిష్యులను పిలిపించుకుని మాట్లాడినట్లు సమాచారం. అలాగే న్యాయసలహాదాలరులతోనూ..మరి కొంతమంది మత పెద్దలతోనూ జగన్ భేటీ అయినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.