మోడీ బేటీ బచావో అంటూంటే..బీజేపీ నేతలు ఏం చేస్తున్నారో
posted on Jul 1, 2016 @ 11:46AM
ఓ వైపు మోడీ బేటీ బచావో..బేటీ పడావో మంత్రాన్ని జపిస్తుండగా బీజేపీ నేతలు మైనర్ బాలికల జీవితాలతో ఆడుకుంటున్నారు. జార్ఖండ్ బిజెపి అధ్యక్షుడు టలా మరాండీ కుమారుడు 11 ఏళ్ల మైనర్ బాలికను వివాహం చేసుకోవడం అక్కడ సంచలనం కలిగించింది. 18 ఏళ్ళ వయస్సువాడైన మున్నా మరాండీ గొడ్డా ప్రాంతానికి చెందిన మైనర్ బాలికను జూన్ 27న బాల్య వివాహం చేసుకున్నాడు. ఆమె ప్రస్తుతం ఆరో తరగతి చదువుతోంది. ఈ వివాహం జరగడానికి ముందు..పెండ్లి చేసుకుంటానని చెప్పి మరో మైనర్‌పై రెండేళ్లుగా లైంగికదాడికి దిగారని ఆరోపణలు వచ్చిన మూడు రోజులకే మున్నా మరో మైనర్ బాలికను పెళ్లి చేసుకోవడం జార్ఖండ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. బుధవారం నాడు జరిగిన రిసెప్షెన్‌కు జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్‌దాస్ హాజరుకావలసి ఉంది. చట్టవ్యతిరేకంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి తాను వెళితే అమ్మో..! ఇంకేమైనా ఉందా అనుకున్న సీఎం చివరి నిమిషంలో కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు.