పిజ్జా బాక్స్‌లో 5 వేల డాలర్లు..!
posted on Sep 27, 2016 @ 7:30PM
డబ్బంటే ఎవరికి చేదు..మనలో చాలా మందికి ఎప్పు డో ఒకప్పుడు రోడ్డు మీద పర్సు కాని, చిల్లర కాని దొరికే ఉంటుంది. కాని ఎంతమంది వాటిని తిరిగి ఇచ్చుంటారు. కాని పరాయి సొమ్ము పాములాంటిదని నమ్మేవారు కూడా ఉంటారు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన సెలీనా ఇలాంటి కోవకే చెందుతారు. ఈవిడకు ఒక రోజు చికెన్ పిజ్జా తినాలనిపించింది...వెంటనే డొమినో పిజ్జాకు ఫోన్ చేసి ఆర్డర్ చేసింది. ఫోన్ పెట్టిన వెంటనే డోర్ కొట్టిన సౌండ్ వినిపించింది. డోర్ తీసి చూడగానే డెలివరీ బాయ్ కనిపించాడు. అతని వద్ద నుంచి పిజ్జా తీసుకుని..తిందామని బాక్స్ తెరిచి చూడగానే అవాక్కైంది. పిజ్జా ఉండాల్సిన ప్లేసులో నోట్ల కట్టలు కనిపించాయి. లెక్కించి చూడగా 5 వేల డాలర్లు ఉన్నట్లు తేలింది.
అయితే అంత డబ్బు చూడగానే బీరువాలో దాచేయాలని అనుకోకుండా..వెంటనే పిజ్జా సెంటర్‌కు ఫోన్ చేసి విషయాన్ని చెప్పింది. ఆ షాపు యజమాని బ్యాంకు నుంచి డ్రా చేసుకుని పిజ్జా కేంద్రానికి వచ్చాడు. సరిగ్గా సెలీనాకు పిజ్జా పార్సెల్ చేస్తున్నపుడు పొరపాటున పిజ్జాకు బదులు డబ్బులు బాక్స్‌లో పెట్టేశాడు. ఈ విషయం తెలియక అలాగే డెలివరీ చేశారు. జరిగిన విషయం తెలుసుకున్న సెలీనా ఆ డబ్బును వారికి తిరిగి అప్పగించింది. ఆవిడ నిజాయితీకి ముగ్ధులైన పిజ్జా సెంటర్ యజమాని అందుకు బహుమానంగా ఏడాదిపాటు డొమినో పిజ్జా ఉచితంగా అందించాలని నిర్ణయించుకున్నారు.