ఉరీ దాడి.. సాక్ష్యాలను అందజేసిన విదేశాంగ శాఖ..
posted on Sep 27, 2016 @ 6:17PM
కిస్థాన్ సరిహద్దులోని ఉరీ సైనిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి చేసి 18 మంది భారత జవాన్లను అంతంచేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి భారత్-పాక్ ల మధ్య ఉన్న వైరం ఇంకా ముదిరింది. అయితే ఈ దాడికి పాల్పడింది పాకిస్థానే అని తెలిసినా.. దీనిపై పాకిస్థాన్ ను ప్రశ్నించినా మాకు మాత్రం ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొస్తుంది. దాడికి పాల్పడిన ఆయుధాలు పాకిస్థాన్ నుండే వచ్చినవని ఆరోపించినా..దానికి పాక్ మాత్రం... ఆయుధాలు పాక్ నుండి వస్తే పాకిస్థానీయులే దాడి చేసినట్టా.. ఆయుధాలు పాకిస్థాన్ వైనంత మాత్రాన ఉగ్రవాదులు పాకిస్థాన్ వారనేందుకు సాక్ష్యాలేంటి? ప్రశ్నించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విదేశాంగ శాఖ కార్యదర్శి జైశంకర్.. పాక్ రాయబారి అబ్దుల్ బాసిత్ ను రాయబార కార్యాలయానికి పిలిపించుకుని, యూరీ ఘటనపై సాక్ష్యాలను అందజేశారు. నలుగురు ఉగ్రవాదులు యూరీ సెక్టార్ పై దాడులు జరిపారని, వారికి పాక్ ఆక్రమిత కాశ్మీర్ కు చెందిన ఫైసల్ హుస్సేన్ అవాన్, యాసిర్ ఖుర్షీద్ లు గౌడ్లుగా వ్యవహరించారని, వారిద్దరూ తమ అదుపులో ఉన్నారని ఆయన తెలిపారు. సీమాంతర ఉగ్రవాదాన్ని భారత్ సహించదని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉటుందని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.