పుణె వైద్యుల ఘనత.. 400 గ్రాముల బరువుతో జన్మించిన శిశువుకు ప్రాణం పోశారు!
posted on Jan 6, 2023 @ 1:27PM
తొమ్మది నెలలు అమ్మకడుపులో ఉండి ఎదిగి భూమ్మిదకు వస్తుంది నవజాత శిశువు. అరుదైన సందర్భాలలో ఏడు నెలలకే నవజాత శిశువులు జన్మించడం కద్దు. అలా జన్మించిన వారు సాధారణంగా బరువు తక్కువగా ఉంటారు. ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. తల్లి గర్భంలో తొమ్మది నెలలూ ఉండి భూమి మీదకు వచ్చిన శిశువులు ఆరోగ్యంగా ఉంటారని చెబుతారు.
అయితే కేవలం 24 వారాలకే అంటే ఆరు నెలలకే తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన శిశువును వైద్యులు ప్రాణం పోశారు. సాధారణంగా ఆరు నెలలకే జన్మించిన శిశువు బతకడం అంటే వైద్య శాస్త్రంలో అసాధారణ విషయమేనని నిపుణులు చెబుతున్నారు. వైద్యులు అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. అసాధ్యమే సుసాధ్యమయ్యింది. 6 నెలలకు జన్మించిన శిశువును వైద్యులు కాపాడారు.
పుణెలోని వాకాడ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ శిశువును వైద్యులు కాపాడారు. మహారాష్ట్రలోని పూణెలో ఇది గతేడాది మే 21న నెలలు నిండకుండానే.. ఆరు నెలలకే ఓ బిడ్డకు జన్మ నిచ్చింది. అప్పటి నుంచీ ఆ బిడ్డను వైద్యులు ఇంటెన్సివ్ కేర్ లో ఉంచి కాపాడారు.
చిన్నారి శివన్య పూర్తిగా ఎదిగినట్టు గుర్తించిన తర్వాత 2022 ఆగస్ట్ 23న డిశ్చార్జ్ చేశారు. గ్రాములకు చేరింది. ఆ చిన్నారి జన్మించినప్పుడు ఆమె బరువు కేవలం 400 గ్రాములు మాత్రమే. ప్రస్తుతం ఈ బేబీ 4.5 కిలోల బరువుకు చేరుకుంది. అందరి పిల్లల్లా ఆరోగ్యంగానే ఉండడమే కాకుండా, ఆహరం కూడా తీసుకుంటోంది.