Read more!

స్టమక్ ఫ్లూ అంటే మీకు తెలుసా ?...

 

స్టమక్ ఫ్లూ అంటే ఏ మిటి ? స్టమక్ ఫ్లూ లక్షణాలు ఎలా గుర్తించాలి ?దీనినుంచి మనం ఎలా రక్షించ బడాలి?మనం తీసుకునే ఆహారం సరిగా లేనందువల్ల మన పొట్టలో రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అందులో ఒకటి స్టమక్ ఫ్లూ పొట్టకి ఫ్లూ  ఇది ఏమిటి? అని మాత్రం ఆశ్చర్య పోకతప్పదు. దీనిని వైద్య పరిభాష లో గ్యాస్ట్రో ఏంట్రా యిటీ స్ అని అంటారు. శరీరంలో పంచ తత్వాలలో వాపు వల్ల లేదా కడుపులో ఇన్ఫెక్షన్ వల్ల స్టమక్ ఫ్లూ వస్తుంది. ఈ వ్యాధి అంత ప్రమాద కరమైనది కాదు.దీనిని నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించక తప్పదు.స్టమక్ ఫ్లూ కు కారణం సహజంగా వైరస్ బ్యాక్టీరియా పరాన్న జీవులు లేదా ఒక్కోసారి మీరు వాడే మందులు సైతం రీయాక్షన్ కూడా కారణంగా చెప్పవచ్చు.

స్టమక్ ఫ్లూ అంటే ఏమిటి?....

స్టమక్ ఫ్లూ వల్ల రోగి పొట్టలో కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల కారణంగాకడుపులో తిప్పినట్టు, తెమిలి నట్టు.   అతి సారం వంటి సమస్యలు రావచ్చు. నోరో వైరస్, నోటా వైరస్.ఎగస్ట్రా వైరస్,తదితర వైరస్ లు లేదా ఎల్లప్పుడూ మీరు తీసుకునే ఆహారం విషపూరితం కావడం,లేదా పాడై పోయిన ఆహారం తీసుకోవడం, మనం తీసుకునే నీరు కలుషితం కావడం అది శరీరంలో చేరడం. వల్ల వేసవిలో నీరు కలుషితమై పోవడం వల్ల పిల్లల నుండి వృద్ధుల వరకూ బలహీనం గా ఉన్నవారిలో ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు నిపుణులు.

వేసవి,వర్షా కాలం లో తీవ్ర ప్రమాదం....

స్టమక్ ఫ్లూ విషయం లో వేసవికాలం లేదా వర్షా కాలం వాతావరణం లో ఎక్కువగా చూడవచ్చు. వాతావరణం లో వేడిమి చమట పట్టడం.శరీరం నుండి ఉప్పు నీరు బయటికి పోవడం తో ఇన్ఫెక్షన్ వల్ల శరీరంలోకి బ్యాక్టీరియా చేరుతుంది. ఈ కాలం లోనే శరీరంలో బయట బ్యాక్టీరియా పెరిగేందుకు అనువైన వాతావరణం గా చెప్పవచ్చు. ఈ వాతావరణం లో పండ్లు, కూరగాయలు, ఒండిన అన్నం కూర త్వరగా పడిపోతాయి. అప్పుడు ఈగలు,దోమలు ,జీవాణు వులు. ఒకప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకు వెళతాయి.

స్టమక్ ఫ్లూ లక్షణాలు...

ఆకలి వేయక పోవడం.పోత్తనోప్పి, వాంతులు,ఆతిసారం , మంట, ఒక్కోసారి చలిగా ఉండడం ,వణకడం.జ్వరం. మడమలు పదాలు పట్టుకు పోవడం.కండరాలాలో నొప్పి, శరీరంలో స్వల్పంగా వేడి, ఎక్కువగా చమట పట్టడం.

స్టమక్ ఫ్లూ నుండి రక్షణ పొందడం ఎలా?...

వేసవి కాలం లో ప్రత్యేకంగా నీటిని తీసుకోవాలి,మజ్జిగ,నిమ్మరసం, ఒఅరెస్ వంటివి తీసుకోండి. ఎర్రటి ఎండలోతిరగడం,లేదా వేడి నీళ్ళు తాగడం చేయకండి. పైన పేర్కొన్న లక్షణాల ను గుర్తించి ఏమాత్రం అశ్రద్ధ చేసిన ఒక్కోసారి ప్రాణ హాని తప్పదు అంటున్నారు నిపుణులు.