Read more!

ఇంటి చిట్కాతో దోమలు పరార్...


అవునా నిజమా అనిమాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేయకండి. అసలే వేసవి కాలం సూర్యాస్తమయం కాగానే గాలి కావాలి అంటూ తలుపులు కిటికీలు బార్లా తెరిచిపెడతారు.అంతే ఇంకేముంది జుమ్మంటూ దోమలు చెవిలో రొదపెడుతూ ఉంటాయి.దోమలు దూరాయో అంతే సంగతులు  ఎన్ని మస్కిటో కాయిల్స్ వాడినా,మస్కిటో బాటిల్స్ పెట్టినా దోమలు స్వైరవిహారం చేస్తాయి. దోమకాటు వల్ల  ఎక్కడ పడితే అక్కడ కుట్టి చంపుతాయి.వాటి ఫలితంగా ఎర్రటి మచ్చలు,దద్దుర్లు ,మంట,నొప్పి  దురద తో తీవ్ర ఇబ్బందులు పడతాడు.వేసవి కాలం లో దోమల ను తరిమికోట్టా లంటే ఏమి చేయాలి.? ఏమిచేయగలం మీరు దోమల నుండి విముక్తి పొందే ఉపాయం వెతుకుతున్నారా అయితే ఈ ఇదు రకాల ఉపాయాలు మీకోసం.

వేసవి కాలం లో దోమలు లేని ఇల్లు ఉండాలని కోరుకోవడం పెద్ద సహాసమే అవుతుంది. మనలో చాలా మంది దోమలు లేకుండా ఉండేందుకు స్ప్రే లు, కాయిల్స్ లిక్విడ్స్, వాడతారు. ఇంటిలోపల దోమల నుండి విముక్తి కల్పించడం లో చాలా చాలా ప్రాచుర్యం ఉంది. అయితే ఇందులో రసాయనాలు నిండి ఉంటాయి.అవి ఊపిరి పీల్చుకోవడం లో తీవ్ర ఇబ్బందులు కలిగిస్థాయి . వేసవి రాగానే పెరుగు తున్న ఉష్ణోగ్రతల కు తగ్గట్టుగా సహజమైన పద్దతులు ఉపాయాల కోసం వెతుకుతూ ఉంటారు.దోమ కాటు వల్ల మలేరియా,డెంగ్యు, పచ్చకామెర్లు వంటి అత్యంత ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలుతీసుకు వస్తాయి. కుట్టిన ప్రదేశంలో దురద వస్తుంది. నిద్ర పోనివ్వదు.వేసవి కాలం లో దోమలను తరిమి కొట్టాలంటే పద్దతులు ఏమిటి?మీరు కూడా దోమల బారినుండి విముక్తి పొందడానికి ఉపాయాలు వెతుకుతున్నారా అయితే ఇవి మీకోసం.

ఇంటి బయట దోమలు రాకుండా ఉండాలంటే...

మీ ఇంటిని దోమలు లేని ఇంటిగా మార్చాలని అనుకుంటే అందరూ అనుసరించే పద్ధతి ఇది. ఇందుకోసం కొన్ని నిమ్మకాయలు లవంగాలు ఇంటి దగ్గరలో ఉంచండి. ఈ పద్దతిలో నిమ్మపండును రెండు భాగాలు చేయండి. కోసిన నిమ్మకాయాలో లవంగాలు గుచ్చి పెట్టండి.  ఇది తక్కువ ఖర్చు తో కూడుకున్న పద్ధతి ఎందుకంటే దోమలకు పులుపు పదార్ధాల వాసనను అసహ్యించు కుంటాయి.దోమలకు ఆవాసన పడదు.నిమ్మకాయాలు లవంగాలు ఉన్న ప్లేట్ ను పెట్టండి.ఇది ప్రాకృతికమైన రసాయనం హానికరం కానిది.ఇంట్లో మాత్రమే వాడే  బెస్ట్ మస్కిటో రేపెలేంట్ మరి.

దోమల నివారణకు తులసి మొక్కలు...

సహజంగా ప్రకృతి నుంచి లభించే అత్యంత పవిత్రమైన మొక్క తులసి . తులసిలో అనేక రకాల ఔషద గుణాలు ఉన్నాయన్న విషయం మీకు తెలిసిందే తులసి మొక్కలు ఉండడం వల్ల దోమలు ఇంట్లోకి రాకుండా ఉంచుతుంది. తులసి రసం శరీరం పై రాసుకోవడం ద్వారా ఒడోమాస్ లా పనిచేస్తుంది దోమలు మీశరీరాన్ని తాకలేవు అంటున్నారు నిపుణులు.

లెమన్ గ్రాస్ ...

ప్రతి ఇంలో లెమన్ గ్రాస్ వాడకుండా ఉండరు. లెమన్ గ్రాస్ సువాసన కారణం గా దీని తాజా తనం మరింత ఆకర్షిస్తుంది. ఈ సువాసన దోమలను తరిమేస్తుంది అలాగే మీ మూడ్ ను పెంచుతుంది.

 బంతి పువ్వు/లేదా సువాసన నిచ్చే పువ్వులు...

ఎపువ్వుఆయినా ముఖ్యంగా బంతి పువ్వు కేవలం మీ ఇంటి అలంకరణకు మాత్రమే కాదు ఆపూల సువాసన దోమలను తరిమేస్తుంది. అసువాసన దోమలను తరమడమే కాదు. ఇతర క్రిమికీట కాలాను తరిమేస్తుంది.అందుకే దశరా దీపావళి రోజుల్లో దోమలు రాకుండా బంతిపువుల్లు కట్టడం లో రహాస్యం తెలిసిందిగా బంతిపువ్వు లో రహాస్యం అమలు చేయండి ఫలితం చూడండి. 

కర్పూరం...

కర్పూరం ఈ పేరు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. కర్పూరం సహజంగా భారతీయ సంప్రదాయం తో ముడిపడింది. అటు బక్తి కి ఇటు ఆరోగ్యానికి,లేదా నర ఘోష పోవాలన్నా కర్పూరం శ్రేష్టం అని అంటునారు. ముఖ్యమైన విషయం మీరు కర్పూరం వెలిగించి నప్పుడు మీ ఇంటి కిటికీ లు,తలుపులు మూసి వేయండి. కొంత సేపటి తరువాత తలుపులు తెరవండి అలా చేస్తే మీఇంట్లో ఉండే దోమలు పరార్.

పరిశుభ్రత పాటించండి...

దోమలను తరమాలంటే మస్కిటో రేపలేంట్లు వాడతారు. అందులో లేవేండర్ ఆయిల్ కలుపుతారు లేవేందర్ ఆయిల్ వాడడం వల్ల సువాసన మాత్రమే కాదు దోమలను తరిమేస్తుంది.సో మీఇట్లో దోమలు పోవాలంటే ఖర్చేలేకుండా పద్దతిగా చేసెయ్యండి.