మామిడి పండు తో ఏదైనా కలిపి తిన్నారో అంతే....
posted on Apr 15, 2022 @ 9:30AM
మీరు మామిడి పండు తింటున్నారా తిన్నతరువాత ఇంకేమైనా తిన్నారో అంతే సంగతులు ప్రమాదం పొంచి ఉందన్న విషయం మీకు తెలుసా.?మామిడి పండు తిన్న వెంటనే 5 రకాల ఆహారాలు నిషిద్దం వాటిని మామిడి పండుతో కలిపి తిన్నారో అనారోగ్యం పాలైనట్లే.మామిడి పండును చూడగానే మీకు నోరు ఊరడం ఖాయం అసలు మామిడి పండు ప్రేమికులుఅయితే మాత్రం నోరు కట్టుకుంటారా చెప్పండి.ఎందుకంటే ఇది మామిడిపళ్ళ సీజన్ వచ్చేసింది. దీనికోసమే మామిడి పండుప్రియులు సంవత్సరం అంతా వీటికోసం ఎదురు చూస్తూ ఉంటారు.నోరు ఊరించే నూజివీడు రసాలు, కోసుకు తినే పళ్ళు, కలెక్టర్ కాయలు,తోతాపురి కాయలు,బెనిషా ,చిన్నరసాలు ,పెద్దరసాలు ఎన్నిరకాల మామిడిపళ్ళు అసలు మామిడి పండునుఆశ్వాదిస్తూ తింటుంటే ఎంత ఆనందంగా ఉంటుందోతినే వాళ్ళకే తెలుస్తుంది. అయితే మామిడి పండును తింటున్నప్పుడు కొన్నివిషయాలు తప్పనిసరిగా పాటించండి.వేసవి కాలం వస్తూనే మార్కెట్లో ఫలరాజు మామిడి పండు చేసే సందడి వేరు. రకరకాల మామిడిపళ్ళు మనకు మార్కెట్లో దర్సనమిస్తాయి.అసలు మామిడి పండు అంటే ఇష్టపడని వాళ్ళు ఉంటారా చెప్పండి. మామిడి పండ్లు మార్కెట్లో కనపడడం పాపం రాత్రి పగలు అదే పనిగా మామిడి పళ్ళను జుర్రేస్తూ ఉంటారు.వాటిధర ఎంతైనా కాని అవి తినితీరాల్సిందే అంటారు.అయితే మామిడి పండు తినే వారు కొన్నిఅంశాల పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.మామిడి పండు తిన్న వెంటనే మరి ఎఇతర వస్తువు తినకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి. అలా చేయకుంటే మీరు అనారోగ్యం పాలవ్వడం ఖాయం.మీరు ముందు ముందు మామిడిపళ్ళు తిని ఆస్వాదించాలని జాగ్రత్తలు పాటించండి. మామిడి పండు తిన్న వెంటనే కొన్నిరకాల వస్తువులు తినకూడదు అన్న విషయం తెలిసిన వాళ్ళు తక్కువే.మిమ్మల్ని మీరు రక్షించుకోకుంటే అది మీకే కష్టం రండి అదిఎమిటో చూద్దాం.
1) మామిడి పండు తిన్నాక కూల్ డ్రింక్ తాగవద్దు...
ఏదైనా తిన్న తరువాత సహజంగా ఎవరికైనా దాహం వేస్తుంది. ముఖ్యంగా తీపి వస్తువులు తిన్నాక దాహం వేస్తుంది. దానికి నీళ్ళు తాగితే చాలు కూల్ డ్రింక్స్ శీతల పానీయాలు అంటే సోడా,పంచదార కలిపిన ఇతర పానీయాలు శరీరానికి హాని కలిగిస్తాయి.మామిడి పండులో సహజంగానే తీపి శాతం ఎక్కువగా ఉంటుంది. ఆతరువాత కూల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ పెరిగే ప్రమాదం ఉంటుంది.
2) పెరుగు తినవద్దు...
దక్షణాది రాష్ట్రాలలో సహజంగా భోజనం తరువాత పెరుగు అన్నం లో అరటి పండు,లేదా వేసవి కాలంలో మామిడి పండు తినడం అలవాటు.ఇంకొందరు మామిడి పండు తిన్నాక చివరన చేతిలో పెరుగు వేసుకుని తినడం అలవాటు.అది సరైన పద్ధతి కాదు.ఎందుకంటే మామిడి పండు పెరుగు కలిపి తినడం వల్ల కార్బన్ డైయాక్సైడ్ తయారు అవుతుంది దీనివల్ల పొట్టలో పలు రకాల సమస్యలు వాస్తాయి.
౩)నీరు తాగడం...
ఏ మైనా తిన్న వెంటనే మంచినీళ్ళు తాగడం సరైన పద్దతికాదు. తిన్న తరువాత దాహం వేయడం సహజం. కొంతసేపు ఆగిన తరువాత నీటిని తాగడం మంచిది.మామిడి పండు తిన్న వెంటనే నీరు తాగితే అరగడానికి తీవ్ర ఇబ్బంది పడుతుంది.దీనివల్ల గ్యాస్ గుండెల్లో మంట వంటి సమస్యలురావచ్చు
ఖారం లేదా మసాలాలకు దూరంగా ఉండండి ...
సహజంగా వేసవి కాలం లో భోజనం తరువాత మామిడి పండు తినడానికి ఇష్టపడతారు.అయితే ప్రస్తుత పరిస్థితులలో ఈ పద్ధతి సరైనది కాదు.మసాలాతో కూడిన ఖారం తిన్న తరువాత మామిడి పండు తింటే పొట్టలో మంట, వికారం,తెమిలినట్లు గా ఉండడం వంటి సమస్యలు.వస్తాయి ఒక్కోసారి వెక్కిళ్ళు వంటి సమస్యలకు దారితీయవచ్చు.
కాకరకాయ తినవద్దు ...
మనం సహజంగా భోజనం చేస్తున్నప్పుడు మీ పళ్ళెం లో కాకర కాయ మామిడి పండు కలిపి తినడం ద్వారా పొట్టకు సంబంధించిన సమస్యలురావచ్చు మామిడి పండు తిన్న వెంటనే కాకర కాయ తినడం వల్ల వాంతులు కడుపులో మంట,కడుపులో మెలిప్ప్పినట్టుగా ఉండడం ఇతర వస్తువులు తినలేని పరిస్థితి సమస్యలు వస్తాయి. సో అదండీ మామిడి పండు ఇతర వస్తువులతో కలిపితీసుకుంటే వచ్చే అనర్ధాలు.చెప్పడం మావంతు ఆచరించడం ఆచరించక పోవడం మీవంతు.