ఆరోగ్యానికి ఆయుర్వేద పానీయాలు!
posted on Apr 14, 2022 @ 9:30AM
వేసవిలో మీశరీరం చల్లగా ఉండాలంటే సహజ సీద్ధమైన శీతల పానీయాలు ఇవే...
వేసవికాలంలో ఎండవేడిమి తట్టుకోవాలంటే ఏదైనా చల్లగా తాగాలని అనిపిస్తుంది. శరీరం వేడిమి తాపం నుండి బయట పడాలంటే శరీరం చల్ల బడా లంటే నాలుగు రకాల సహజ సిద్ధమైన ఆయుర్వేద పానీయాలు మీకోసం.వేసవిలో వేడి గాలులతో వాతావరణం వేడెక్కిపోతుంది శరీరాన్ని చల్ల బరచడం అత్యవసరం. అందుకోసంమే కొన్ని ఆయుర్వేద పానీయాలు తీసుకోవడం ద్వారా శరీరం చల్లబడడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారు. మేము మీకు ఇలాంటి కొన్ని రకాల పానీయాల ను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం.అవి మీ ఆరోగ్యానికి సహాయ పడతాయాని ఆశిస్తున్నాం.
చందనంతో పానీయం...
చందనం అంటే మీశారీరాన్ని ముఖ్యంగా చర్మాన్ని చల్ల బరచడమే కాదు ఆరోగ్యంగా ఉంచడం లో లాభ పడుతుంది. ముఖ్యంగా ఇందులో ఒక ఆధ్యామిక రహాస్యం చూడవచ్చు. తిరుపతి లో తల నీలాలు సమర్పించిన తరువాత చందనాన్ని రాసుకోవడం గమనించవచ్చు. కాగా ఉగ్రనారసింహ రూపాన్ని శాంత పరచడానికి చందనం పూయాడం అనవాయితీగా వస్తున్న ప్రక్రియ. దీనిద్వారా మరెన్నో చర్మసంబందిత సమస్యలకు చందనం అరగదీసి పూస్తారు.ఇక పానీయానికి సంబంధించి చందనం లో సహాద్ ను కలిపి తాగడం ద్వారా వేదిమినుంచి ఉపసమనం కలుగుతుంది.
ఖస్ ఖస్ తో చల్లని పానీయం...
ఖస్ ఖస్ అనగానే మనం తెలుసుకుంటే ఖాస్ ప్రత్యేకమైన అని ఆర్ధం వస్తుంది.అయితే పూర్తిగా సోధిస్తే దీనిఅసలు పేరు ఖష్ ఖష్ అంటే గసగసాలు సహజంగా గసగసాలు మన వంటింట్లో నిత్యం వాడే దినుసుగా చెప్తారు. ముఖ్యంగా మసాలా కూరలు చికన్ మటన్ లలో గసగసాలు కొబ్బరి తోచేసిన మషాలా ను వాడడం గమనించవచ్చు.అయితే ఖస్ ఖస్ లో అనేక ఆరోగ్య లాభాలు ఉన్నాయని అంగీకరించక తప్పదని అంటున్నారు నిపుణులు.ఖస్ లో ప్రోటీన్ తో పోరాడే శక్తి ఉందని,ఐరన్ ,కొలస్ట్రాల్ వంటి చాలా సుగుణాలు ఉంటాయి. ఖస్ తో చేసిన ష ర్బత్,పానీయం శరీరాన్ని డీ హైడ్రేషన్ నుండి రక్షిస్తుందని అంటున్నారు నిపుణులు.
బేల్ అంటే వెలగ పండుతో మరో శీతల పానీయం...
వెలగ పండువాడకం ఈ తరం వారికి తెలియదు.అయితే వెలగ పండును అత్యంత ప్రభావ వంతమైన వైద్య గుణాలు ఉనట్లు ఆయుర్వేద వైద్యులు పేర్కొన్నారు.వెలగ పండును గ్రామీణ ప్రాంతలాలో ఇప్పటికీ వాడతారు.ఆయుర్వేదం లో వెలగ పండు ఆకులు పళ్ళకు చాలా ప్రాధాన్యత కల్పిస్తారు.వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరిచేందుకు అందరు వెలగ పండుతో చేసిన షర్బత్ డ్రింక్ ను వాడవచ్చు.ముఖ్యంగా పొట్టలో వచ్చే కడుపు మంటకు ఉపశమనం కలిపించే శక్తి వెలగ పండుకు ఉందని అంటున్నారు నిపుణులు.
దానిమ్మ తో కూల్ కూల్ డ్రింక్...
దానిమ్మ దీనిగురించి తెలియని వారు లేరంటే అతిశయోక్తి లేదు. ముఖ్యంగా శరీరంలో రక్త హీనత బలహీనం గా ఉన్నవారు తప్పనిసరిగా తీసుకునే పళ్ళలో ఒకటి దానిమ్మ గింజలు. దీనిని తీసుకోవడం ద్వారా చాలా లాభాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు.దానిమ్మలో ఐరన్ పుష్కలంగా లభిస్తుందని అంటున్నారు వైద్యులు. మీరు దానిమ్మ జ్యూస్ చాలా సార్లు తాగిఉందవచ్చు.దానిమ్మతో చేసిన డ్రింక్ వేసవి కాలం లో చల్లగా ఉంచే స్వభావం దానికి ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు.
గులాబీ తోస్పెషల్ డ్రింక్...
గులాబీ మంచి సువాసన ఇచ్చే పువ్వు.గులాబీ వల్ల వచ్చే సువాసనకన్నా గులాబీ వాటర్ ను కొన్ని రకాల వైద్యానికి. ముఖ్యంగా చర్మ సౌందర్యానికి గులాబీ వాటర్ పేస్ ప్యాక్ లలో వాడడం మనం గమనించవచ్చు. వేసవికాలం లో గులాబి పకుడియాల నుంచి తీసిన డ్రింక్ తీసుకోవడం వల్ల శరీరం
చాలా చలాకీగా చురుకుగా ఉంచుతుంది అలాగే ఆరోగ్యంగా ఉంచుతుంది.