ఇక వాల్వ్ సర్జరీ కి గుడ్ బై చెప్పొచ్చు...
posted on Apr 16, 2022 @ 9:30AM
కవాటాలలో సమస్యలు ఉంటె వాటికి మరమత్తు చేసే చికిత్సలు ఎప్పటినుంచో ఉన్నాయి.కానీ పూర్తిగా పాడై పోయిన కవాటాన్ని తీసి వేసి కొత్త కావటాన్ని అమార్చాలంటే మాత్రం సర్జరీ తప్పనిసరి అయ్యేది.సర్జరీ చేసే పరిస్థితి లేనివాళ్ళకు ఎటువంటి చికిత్స చేయాలో అర్ధమయ్యేది కాదు. అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్ చేయడానికి సర్జరీ అవసరం లేని కొత్త చికిత్స పదేళ్ళ క్రితమే అందుబాటులో ఉంది. రెండేళ్ళు గా మన దేశం లో అందుబాటులో ఉంది. అదే ట్రాన్స్ కేధటర్ అయోర్టిక్ వాల్వ్ రెప్లేస్మెంట్.11 ఏ ళ్ళ క్రితం అతనికి సర్జరీ చేసినా ఫలితం లేదన్నారు.డాక్టర్స్ ఇకచనిపోవడమే తప్ప బతికే మార్గం లేదని అన్నారు. ఆరోగి తాలూకు బంధువులు.అప్పుడే అతనిని బతికించడానికి అలెన్ క్రిబెయర్ ప్రయత్నం చేస్తానని అన్నాడు. ఒక్కఅవకాశం ఇమ్మన్నాడుఏ పుట్టలో ఏ పాముందో అని సరే అన్నారు బంధువులు.అద్భుతం --ఆరోగి బతికాడు.అప్పుడే అలెన్ క్రిబియర్ చేసిన చికిత్స ట్రాన్స్ కేధటర్ అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్ మెంట్ ఆకొత్త విధానామే నేడు ఎందఱో రోగులకు వరంగా మారిందని ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ ఎ శ్రీనివాస్ కుమార్ తెలుగు వన్ హెల్త్ కు వివరించారు.
సర్జరీ లేని చికిత్స...
కవాటా లలో సమస్యలు ఉన్నప్పుడు అంటే కవాటం లో సమస్య ఉన్నప్పుడు సాధారణంగా దాన్ని రకరకాల పద్దతుల ద్వారా రిపేర్ చేస్తారు. కాని కవాటం పూర్తిగా దేబ్బతిన్నపుడు దాన్ని తీసివేసి కొత్త కావటాన్ని అమార్చాల్సి వస్తుంది.అలాంటప్పుడు అంటే కవాట మార్పిడి అవసరం.
సర్జరీ కన్నా టి ఏ వి ఆర్ మేలు అంటున్న నిపుణులు...
ఇంతకు ముందు సర్జరీ చేయలేనివాళ్లు కు మాత్రమే చేసేవాళ్ళు. కాని అందరికీ బావుందని అధ్యయనాలు జరిజాయి.ఈ అధ్యయనాలను పార్టనర్ స్టడీస్ అంటారని శ్రీనివాస్ స్పష్టం చేసారు.మొదటిపార్ట్ నర్ స్ట డీలో సర్జరీ కి ఫిట్ గా లేని వాళ్ళ కోసం ఈ ప్రొసీజర్ మంచిదని తేలిందిరెండో అధ్యయనం లో సర్జరీకి ఫిట్ గా ఉన్నవాళ్ళకు ప్రొసీజర్ ప్రొసీజర్ మంచిఫలితాలు ఇస్తుందని తేలింది. మూడో అధ్యయనం లో సర్జరీ కన్నా ఇది మంచిదని తేలింది. సర్జరీ మె డిసిన్స్కన్నా దీనిని ఎంచుకోడం ఎక్కువ మేలు చేస్తుందని అంటున్నారు నిపుణులు. దేశం లో 6౦ ఏళ్ళు పై బడిన వాళ్ళకు ఎవరికైనా చేయవచ్చు.
టి వి ఆర్ చికిత్స ఎలా చేస్తారు?...
ఈ చికిత్స చేయడానికి ముందు సమస్య ఏ మేరకు ఉందొ తెలుసుకోడానికి కొన్ని పరీక్షలు అవసరం క్లినికల్గా స్టేత్ తో పరీక్షించడం శబ్దం తెలుస్తుంది. ఎకో టెస్ట్ తో కవాటం ఏ మేరకు కుంచించుకుంది.ఏమేరకు బ్లాక్ ఉందొ తెలుస్తుంది. ఎటువంటి వాల్వ్ వాడాలి ఎంతసైజ్ వాడాలో నుర్దారించ వచ్చు. సిటి స్కాన్ ద్వారా కాలి రక్త నాళం 5 మిల్లీ మీటర్లు ఉందొ లేదో తెలుసుకోవచ్చు.అయోర్టా సైజు వాల్వు ఏ సైజులో ఉందొ కూడా చూడవచ్చు.అందుకు సిటి స్కాన్ తప్పనిసరి రక్తనాళం లో బ్లాక్స్ ఉన్నాయో తెలుసుకోడానికి ఆంజియోగ్రామ్ చేస్తారు.ఆతరు వాతే ట్రాన్స్ కేధటర్ ఆయోర్టిక్ వాల్వ్ రెప్లేస్ మెంట్ ప్రొసీజర్ చేస్తారు.దీనికోసం పెద్ద పెద్ద కోత పెట్టాల్సిన అవసరం లేదు.కాలి రక్త నాళం గుండా వాల్వ్ ను పంపించి పాడైన వాల్వ్ స్థానం లో కొత్త కవటాన్నివేస్తారు రక్త నాళం గుండా 14 ఫ్రెంచ్ మాత్రమే కోత పెట్టి కొత్త కావటాన్ని పంపిస్తారు బెలూన్ ద్వారా వాల్వ్ ను అమరుస్తారు.
అన్ని కవాటాలకూ చేయొచ్చా ?...
ప్రస్తుతం మైట్రల్ వాల్వ్ పాడైతే కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఇదే అయోర్టిక్ వాల్వ్ ను రివర్స్ చేసి పెడుతున్నారు.దీనిని అయోర్టిక్ వాల్వు కు మాత్రమే చేస్తున్నారు. మైట్రల్, ట్రే కస్పిడ్ వాల్వ్ కు ఇలాంటివి అందుబాటులోకి రావొచ్చు.ఇంకా వీటిపై అధ్యనాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మైట్రల్ వాల్వ్ పాడైతే దాన్ని రివర్స్ చేసి పెడుతున్నారు భవిష్యత్తులో దీనికి కూడా ఇలాంటి ట్రాన్స్ కేధటర్ రీప్లేస్ మేంట్ అందుబాటులోకి రావొచ్చు లీకేజ్ ఉన్నాకూడా పెట్టవచ్చు.