ఈ దీపావళితో అయినా చీకటి కమ్ముకున్న వారీ జీవితాల్లో వెలుగు నింపుతుందా?
posted on Oct 22, 2019 @ 12:30PM
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి ప్రజలు జరుపుకుంటారు. అలాగే చీకటిని పారద్రోలి అలాగే చీకట్ల నుంచి వైదొలగడానికి కూడా వెలుగులు నింపడానికి దీపావళి జరుపుకుంటారు.అలాంటి దీపావళి మనం వెలుగుల్లో జరుపుకుంటున్నాం అంటే ఆ ప్రమిదల తయారీలో కుమ్మరులు ఎంతగానే కష్ట పడుతుంటారు.వారి జీవనచక్రం నడవాలంటే నిత్యం కుమ్మరి చక్రం తిరగాల్సిందే కష్టమో నష్టమో శ్రమకు తగ్గ ఫలితంతోనే బతుకు బండిని లాగుతుంటాడు. ఒకప్పుడు మన జీవనంలో కుమ్మరి చక్రం కీలక పాత్ర పోషించింది కానీ మారుతున్న కాలం పద్ధతులు ఆ చక్రం వేగాన్ని తగ్గించాయి. దీపావళి కైనా వారి రాత మారుతుంది అనుకుంటే పొరపాటే. దీపావళికి ఏదైతే తయారు చేస్తారు దీపాలు కావచ్చు, ప్రమిదలు కావచ్చు అనేక రకాలైనటువంటి వస్తువులను కుమ్మరులు ప్రతి ఏటా కూడా ఎంతో కష్టపడి శ్రమించి ఆ మట్టిని ఒక ప్రతి రూపంగా తీర్చిదిద్దుతుంటారు.
విజయవాడకు సమీపంలో కొత్తూరు, తాడేపల్లి, భీమావరం వెళితే ఇలాంటివారే ఎందరో కనిపిస్తారు. కుమ్మరి వృత్తిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఎండాకాలం కుండలు పండగలప్పుడు ప్రమిదలు తయారు చేస్తూ బతుకు బండిని లాగుతున్నారు. ఎంతో కష్టపడి ప్రమిదలూ తయారు చేస్తే వీరికొచ్చేది ఒక్క రూపాయి. అదే ప్రమిద మార్కెట్ లోకి వచ్చే సరికి ఐదు రూపాయలకు పైగానే పలుకుతది. గతంలో ప్రతి ఇంట్లో మట్టికుండలు పాత్రలు ఉండేవి. కానీ ఇప్పుడు వాటిని వాడుతున్న వారి సంఖ్య తక్కువే అని చెప్పాలి. లోహపాత్రల రాకతో కుమారులపై పెద్దబండ పడినట్టైంది. దీపావళి వేసవి సమయాల్లో అయినా పని మొదలు పెడతామంటే వర్షం తీవ్రంగా నష్టపరుస్తున్నది.
దీంతో బతుకుతెరువు కోసం ఇతర మార్గాల వైపు మరలిపోతున్నారు. కుమ్మరికి వరుణుడు శత్రువు అనే చెప్పాలి. మట్టి ముద్దను అందంగా తీర్చిదిద్దాక వర్షం పడితే అప్పటి వరకూ పడ్డ కష్టమంతా వృథా అవుతుంది. అందుకే ప్రభుత్వం షెడ్లను ఏర్పాటు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. దీపావళి నాడు అందరి ఇళ్లలో వెలుగులు నింపుతారు కుమ్మర్లు. అయితే మనకు వెలుగులు నింపుతున్న వారి జీవితాలు మాత్రం చీకట్లోనే ఉంటున్నాయి. వర్షం పడితే బట్టీల తడిచిపోయి లోపల ఉన్నటువంటి ప్రమిదల కావచ్చు వివిధ రకాల ప్రతిరూపాలన్ని కూడా ఆ మట్టి ముద్దలా మారిపోతాయి కనుక ఖచ్చితంగా ఇలాంటివి తాత్కాలికమైనటువంటి ఏర్పాట్లు షెడ్డులాంటి ఏర్పాటు చేసి మాకు ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా కుమ్మరులు చెబుతున్నారు. దీపావళి వారి జీవితాల్లో వెలుగులు నింపేలా చేయాలని అధికారులను కోరుకుంటున్నారు కుమ్మరులు.