తెలంగాణలో క్షణం కూడా ఉండలేం
posted on Nov 13, 2013 @ 9:31AM
తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్రం దూకుడు ప్రదర్శింస్తుంటే సీమాంద్ర కాంగ్రెస్ నాయకులకు ఏమి పాలుపోవడం లేదు. అందుకే రోజుకో రకంగా స్టేట్‌మెంట్స్ ఇస్తూ తమ నిరుత్సాహాన్ని ప్రకటిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జేసి దివాకర్ రెడ్డి ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రవిభజన జరిగితే తెలంగాణ ప్రాంతంలో సీమాంద్ర వాసులు ఒక్క క్షణం కూడా ఉండటం దండగ అని అన్నారు. మంగళవారం సిఎల్పీ కార్యాలయంలో పలువురు పార్టీ నాయకులతో పిచ్చాపాటిగా మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన తరువాత ఇక్కడ ఉండటం కన్నా కొత్త రాజధానిలో గుడారాలు వేసుకొని పని చేసుకోవడం మంచిదన్నారు.
రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రాంతంలో ఒక్క క్షణం కూడా ఉండటం దండగ అని మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ కాంగ్రెసు నాయకులు జెసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం సిఎల్పీ కార్యాలయంలో జెసి, గాదె వెంకట రెడ్డి, యాదవ రెడ్డి తదితరులు పిచ్చాపాటిగా మాట్లాడుకున్నారు. ఈ సమయంలో రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని అంశం చర్చకు వచ్చింది. దీనిపై జెసి మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధానిలో గుడారాలు వేసుకుని పని చేస్తామంటే ఎవరైనా వద్దంటారా? అని ప్రశ్నించారు. గుడారాల్లో పని చేస్తూనే రాజధాని నిర్మాణాన్ని కొనసాగించవచ్చని, ఇందుకు మహా అయితే ఐదేళ్లకు మించి సమయం అవసరం ఉండదన్నారు