రాష్ట్రపతికి బాబు లేఖ

 

తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్ర అనుసరిస్తున్నతీరుపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన అంశంలో ఇరు ప్రాంతాల అభిప్రాయలకు కేంద్ర విలువ ఇచ్చేలా చూడాలని ఆయన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కోరారు.

 

జీవొయం భేటికి రావాలని కేంద్రహొం శాఖకు రాసిన లేఖకు బదులుగా ఆయన ప్రణబ్‌ ముఖర్జీకి లేఖ రాశారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ చేసిన సిఫార్సులను పట్టించుకోనందుకు నిరసనగా జీవోయం భేటిని బహిష్కరించారు.

 

రాష్ట్రపతికి రాసిన లేఖలో చంద్రబాబు ముఖ్యంగా మూడు విషయాలను ప్రస్తావించారు. రాష్ట్ర విభజన అంశంలో రాజ్యాంగ నియమాలు, గతంలో పాటించిన సంప్రదాయాలను గౌరవించాలి. ఇరు ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు, విద్యార్థులు, రైతులకు సంబంధించిన జేఏసీలను పిలిచి సమస్యాత్మక అంశాలపై విపులంగా చర్చించాలి. ఇతర ప్రభావిత వర్గాల మనోగతాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొన్న తర్వాతే ముందుకు వెళ్లాలి అని ఆయన రాష్ట్రపతిని కోరారు.