దివ్యాంగురాలికి అంగరంగ వైభవంగా వివాహం ఎరితోనో తెలుసా?
posted on Nov 11, 2022 @ 11:12AM
దివ్యాంగురాలైన తన కుమార్తెకు తండ్రి అంగరంగ వైభవంగా వివాహం జరిపించాడు. అత్యంత ఘనంగా ఏర్పాట్లు చేశాడు. ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగూ అని వివాహ వైభవం గురించి చెప్పుకుంటూ ఉంటాము. కానీ గ్వాలియర్ కు చెందిన శివపాల్ అనే వ్యాపార వేత్త మాత్రం తన కుమార్తె వివాహానికి అంతకు మించి అన్నట్లుగా ఏర్పాట్లు చేశారు.
ఒక వివాహం గురించి ఇంత ఉపోద్ఘాతమెందు కంటారా? ఇలాంటి వివాహం ఇలలో ఎవరికీ జరిగి ఉండదు. జరిగి ఉండదు కాదు. జరగలేదు. ఇంతకీ ఈ దివ్యాంగురాలికి ఎవరితో వివాహం జరిగిందో తెలుసుకుంటే... ఈ ఉపోద్ఘాతం చాలదని అందరూ అంగీకరించి తీరుతారు. గ్వాలియర్ కు చెందిన శివపాల్ ఒక వ్యాపార వేత్త. ఆయన కుమార్తె వయస్సు 26 ఏళ్లు. ఆమె దివ్యాంగురాలు. వినలేదు, మాట్లాడలేదు. అంతే కాదు గత 21ఏళ్లుగా ఆమె చక్రాల కుర్చీకే పరిమితమై ఉంది.
కుమార్తెను అత్యంత ఆప్యాయంగా, ప్రేమగా పెంచుకునే శివలాల్ తన కుమార్తె వివాహం చేయలేనేమోనని బెంగపడ్డారు. అయితే ఆధ్యాత్మిక భావనలు ఎక్కువగా ఉన్న ఆయనకు కుబ్జ కథ గుర్తుకు వచ్చింద. అంతే తన కుమార్తెకు శ్రీకృష్ణుడే తగిన వరుడని నిర్ణయించుకున్నాడు. అంతే ఆఘ మేఘాల మీద శ్రీ కృష్ణ భగవానుడితో తన కుమార్తె వివాహానికి ఏర్పాట్లు చేసేశాడు.
ఓ అమ్మాయికి శ్రీకృష్ణుడి వేష ధారణతో అలంకరణ చేశాడు. మొత్తం మీద అనుకున్న విధంగా తన కుమార్తెను కృష్ణ భగవానుడికి ఇచ్చి అంగరంగ వైభవంగా వివాహం చేశాడు. ఈ వివాహానికి సంబంధించిన వార్తలు, ఫొటోలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్నాయి. వికలాంగురాలైన తన కుమార్తెపై శివపాల్ కు ఉన్న ప్రేమానురాగల పట్ల నెటిజన్లు ముగ్ధులౌతున్నారు.