మళ్లీ రాజుకున్న కడియం, రాజయ్య విభేదాలు
posted on Aug 30, 2022 @ 11:46AM
ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు. దీనికి పెద్ద ఉదాహరణగా టీఆర్ ఎస్ సీనియర్ నేతలు కాపు రాజ య్య, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిగా చెప్పుకోవచ్చు. చిత్రమేమంటే ఇద్దరిదీ నియోజకవర్గం, రాజకీయంగా ఒకే కారులో ప్రయాణం. కానీ ఎజెండాల్లో తేడా వచ్చింది. చాలాకాలం నుంచే వీరిద్దరి మధ్య ఆధిపత్యపోరు తెరమీదకు వస్తూనే ఉంది. ఒకరిపై ఒకరు అవకాశం దొరికినపుడల్లా మాటల తూటాలతో విరుచుకుపడటం తెలంగాణా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడిద్దరూ ఒకే పార్టీ కానీ.. ఒకప్పుడు రాజయ్య కాంగ్రెస్. కడియం టీడీపీ. అప్పట్లోనే ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేది. ఇప్పుడు ఒకే పార్టీ జెండా నీడన ఉన్నా నిలవలేకపోతున్నారు.
కడియం శ్రీహరి పై స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యా ఖ్యలు చేశారు. కడి యం శ్రీహరి 361 మంది నక్సలైట్ల ను పొట్టనబెట్టుకున్నారని ఆరోపించారు. కడియం శ్రీహరి మంత్రిగా ఉన్న సమయంలోనే ఈ హత్యలు జరిగాయన్నారు. ఒక్క స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గం లోనే ఇంత మంది చనిపోయారని తెలిపారు. వైఎస్సార్ నీ గురువైతే, కేసీఆర్ నా దేవుడు. స్టేషన్ ఘన పూర్ నియో జకవర్గానికి నేను పూజారిని. స్టేషన్ ఘనపూర్ నా అడ్డా, ఎవరినీ అడుగు పెట్టనివ్వబోను అంటూ రాజయ్య శపథం చేశారు.
ఇప్పటికే రాజయ్య, కడియం మధ్య ఉప్పునిప్పుగా పరిస్థితి ఉంది. ఎమ్మెల్సీలతో అభివృద్ధి జరగదని, ఎమ్మెల్యేలతోనే జరుగుతుందని ఇప్పటికే కడియం శ్రీహరిని ఉద్దేశించి రాజయ్య వ్యాఖ్యలు చేసిన విష యం తెలిసిందే. ఈక్రమంలోనే తాజాగా చిల్పూర్ మండలం చిన్నపెండ్యాలలోని ఓ కార్యక్రమంలో కడి యంను ఉద్దేశించి రాజయ్య చేసిన వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో వేచి చూడాలి.
నడిచే ఎద్దుకే ముళ్ళు కర్ర.. పండ్లున్న చెట్టుకే రాళ్లు. అంటూ గతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటి కొండ రాజయ్య కడియం శ్రీహరి పై గతంలో పరోక్ష విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లో ఎవరి ఎత్తు గడలు వాళ్ళకి ఉంటాయి. కేసీఆర్ సర్వే చూస్తే మీకు తెలుస్తుంది ఎవరు గొప్పనో.. చంద్రబాబు నాయకత్వం లో కడియం పనిచేసినప్పుడు జన్మభూమి లో జరిగితే కొన్ని పనులు జరగొచ్చు. కానీ తాను కేసీఆర్ నాయకత్వంలో అంతకు మించి పనులు చేస్తున్నా, సాగునీటి రంగంలో స్టేషన్ గన్ పూర్ నంబర్ వన్ గా ఉంద ని, ఇందిరమ్మ ఇళ్లు తన హయంలోనే వచ్చాయన్నారు. ఎవరు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తారో కాలమే నిర్ణయిస్తుందని రాజయ్య వెల్లడించారు.