అస్సాంలో మదరసా కూల్చివేత
posted on Aug 30, 2022 @ 12:06PM
అస్సాం బార్‌పేట జిల్లాలో ఒక మదరసాను బుల్డోజర్‌తో కూల్చివేశారు. దీనికి ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాతో సంబంధాలున్నాయన్నది బయటపడింది. బార్‌పేట జిల్లాలో బంగ్లాదేశ్ ఉగ్రవాద సంస్థ అస్సరుల్లా బంగ్లా టీమ్‌లో సంబంధాలున్నాయనే ఆరోపణలపై అక్బర్ అలీ, అబుల్ కలాం అజాద్ అనే సోదరులను పోలీ సులు అరెస్టు చేశారు. ఆ తర్వాతనే మదరసాను కూల్చివేశారు.
ధకలియాపరా వద్ద ఉన్న మదరసా టెర్రరిస్టు హబ్‌గా నడుస్తున్నందున తాము దాన్ని బుల్డోజరుతో కూల్చివేశామని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ చెప్పారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలు, జిహాదీ సంస్థ ల కార్యకలాపాల్లో పాలు పంచుకోవడంతోపాటు ప్రభుత్వ భూమిలో ఉన్నందున దాన్ని కూల్చామని ప్రభుత్వ అద నపు కమిషనర్ లచిత్ కుమార్ దాస్ చెప్పారు.
అంతకు ముందు ఆగస్టు 4వతేదీన కూడా అసోంలోని మోరిగావ్ జిల్లాలో ఒక మదరసాను కూల్చివేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం, విపత్తు నిర్వహణ చట్టం కింద రెండు మదర్సాలను కూల్చి వేశామని సీఎం హిమంత శర్మ చెప్పారు. ఈ ఏడాది అసోంలో ఐదు ఉగ్రవాద కుట్రలను ఛేదించి, పలువురి ని అరెస్టు చేశామని అసోం అధికారులు చెప్పారు.