ముదురుతున్న బూర,జగదీశ్ రెడ్డి వివాదం
posted on Sep 5, 2022 @ 10:19AM
మునుగోడు ఉప ఎన్నిక అన్ని పార్టీల్లోనూ గొడవలు రేపుతోంది. టికెట్ కేటాయింపు విషయంలో, ప్రచారం విషయంలోనూ ఒక అవగాహనకు రావడంలో పార్టీలోనే విభేదాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇపుడు తాజా గా టిఆర్ ఎస్‌లోనూ విభేదాలు ముదిరి పాకాన పడింది.. భువనగిరి ఎంపీ, టీఆర్ఎస్ నేత మాజీ బూర నర్సయ్యగౌడ్ ఆగ్రహించారు. పార్టీ సంబంధించిన కార్యక్రమాల విషయాలు తనకు తెలియ నీయడం లేదని, మంత్రి జగదీశ్ రెడ్డి ఎలాంటి సమాచారం తెలియజేయకుండానే పార్టీకి దూరంచేసే పద్ధతిలో వ్యవహరి స్తున్నారని నర్సయ్య గౌడ్ ఆరోపించారు.
ఏకంగా మంత్రి జగదీశ్రెడ్డికి కామన్‌సెన్స్ లేదా అంటూ కోపగించుకున్నారు. నల్లగొండజిల్లా మునుగోడు లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, బీసీలు అధికంగా ఉన్న మునుగోడులో క్రియాశీలనేతగా చాలా కాలం నుంచి మాజీ ఎంపీగానూ ప్రాతినిధ్యం చేస్తున్న తనకు పార్టీ టికెట్ అడిగే హక్కులేదా అని ప్రశ్నించారు.
పార్టీలో దేనికయినా తుది నిర్ణయం అధినేత కేసీఆర్‌దే కానీ ఇక్కడ మంత్రి జగదీష్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకంగా ఉందన్నారు. తనను పార్టీ కార్యక్రమాలకు పనిగట్టుకుని దూరంగా పెడుతుండటా నికి కారణమేమిటని ప్రశ్నించారు. తననే కాదు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పట్ల కూడా మంత్రి తీరు అన్యాయంగా ఉందని ఆరోపించారు. మంత్రి జగదీష్ రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఇటీవల మునుగోడులో జరిగిన సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లను కూడా ఆయనే చూశారు. జన సమీకరణ విషయం లో సీనియర్ నేతలు బూర నర్సయ్య గౌడ్, కర్నె ప్రభాకర్ ను మంత్రి కనీసం పట్టించుకోలేదని అప్పుడే విమర్శలు వచ్చాయి.
టీఆర్‌ఎ్‌సలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌దే తుది నిర్ణయమని, అయితే మంత్రి వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు. మునుగోడు నియోజకవర్గంలో బీసీలు అధికంగా ఉన్నారని చెప్పారు. టీఆర్‌ఎ్‌సలో క్రియాశీలనేతగా, ఈ ప్రాంత మాజీ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన తనకు ఉపఎన్నికలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలని అడగడం తప్పేంటని, పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టడం ఏమి టని ఆయన ప్రశ్నించారు. తనతోపాటు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పట్ల కూడా మంత్రి అదే ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ ఉపఎన్నికలో గెలిచే అభ్యర్థిగా ఎవరిని బరిలో దింపినా తాను పనిచేస్తానన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పార్టీ గెలుపే లక్ష్యంగా కష్టపడతానని చెప్పారు.