కేసీఆర్ హెచ్చరికతో అవినీతి ఎమ్మెల్యేలు పునీతులు!
posted on Apr 28, 2023 @ 3:58PM
గతం గతహ: పాత తప్పుల గురించి పట్టించుకోను.. ఇకపై తప్పు చేస్తే వదలనంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలను హెచ్చరించారు. అది అలాంటి ఇలాంటి హెచ్చరిక కాదు.. దళిత బంధు పథకం అమలులో అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేలు ఎవరన్నది తనకు తెలుసునని చెబుతూ ఆయన ఒకపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
అంటే ఇక ముందు నిజాయితీగా ఉంటే.. గతంలో చేసిన అవినీతిని క్షమించేస్తాననీ, రైటాఫ్ చేసేస్తాననీ కేసీఆర్ చెప్పారా అన్న చర్చ రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతోంది. గంగలో మునిగితే పాపాలు ప్రక్షాళన అయిపోయినట్లు.. కేసీఆర్ హెచ్చరికతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నీతిపరులైపోయారా? అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. దీనినే వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల ఎత్తి చూపారు.
తప్పు చేస్తే తన బిడ్డయినా, కొడుకైనా వదిలిపెట్టేది లేదు.. జైలుకు పంపుడే అన్న కేసీఆర్.. ఇప్పుడు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను వదిలిపెట్టేశారనీ, ఇప్పటికే ఆయన కొడుకు, కుమారుడూ అవినీతిలో కూరుకుపోయారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారనీ, వారిని వెనకేసుకొస్తున్న కేసీఆర్..తన ఎమ్మెల్యేలపై చర్య తీసుకునే ధైర్యం ఎలా చేస్తారని అందేరూ ఇర మేందు అవినీతికి దూరంగా ఉంటే మీ అందరూ పునీతులే అంటున్నారని షర్మిల ఎద్దేవా చేశారు.
తన పార్టీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డారని స్వయంగా కేసీఆరే అంగీకరించారని, దళిత బంధులో రూ.3 లక్షల లంచం తీసుకుంటున్నారని ఓపెన్ గా చెప్పేసి చర్యలు తీసుకోవడం లేదంటీ అర్ధమేమిటని నిలదీశారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన బిడ్డ కవిత విూద ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తారనే ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చేశారా అని షర్మిల కేసీఆర్ ను నిలదీశారు.