వారి తాట తీస్తానన్న చంద్రబాబు
posted on Sep 6, 2013 @ 11:12AM
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగు జాతి ఆత్మగౌరవ బస్సు యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే గురువారం రాత్రి తాడికొండ మండలంలోని గరికపాడులో చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో కొందరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు వచ్చి "జై జగన్", "జోహార్ వైయస్సార్" అంటూ నినాదాలు చేస్తూ అడ్డు తగిలారు. అదే విధంగా చంద్రబాబు ప్రయాణిస్తున్న వాహనానికి అడ్డుగా నిలుచుని నినాదాలు చేశారు. అయితే వాళ్లని అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కోరినప్పటికీ... వారు అదే పనిగా నినాదాలు చేశారు. దీంతో వారిపైన చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలు మీలాంటి వాళ్ళందరూ జైలులో ఉండాల్సిన వాళ్ళందరూ బయట తిరుగుతున్నారు. పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తాను. ఏదైనా ఉంటే ప్రజల్లో తేల్చుకోవాలి కానీ ఇలా దొంగ దారిన వచ్చి వీరంగం చేయడం ఎక్కడి సంస్కృతి అని మీ పులివెందులకే వచ్చి అక్కడే మీ సంగతి తేలుస్తానంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలపై చంద్రబాబు మండిపడ్డారు. కాన్వాయ్‌లోకి వేరే వ్యక్తలు వస్తుంటే ఏం చేస్తున్నారని బాబు పోలీసులను కోపగించుకున్నారు.