సింగపూర్ లో ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలు
posted on Dec 27, 2012 8:57AM
ఢిల్లీ గ్యాంగ్‌రేప్ బాధితురాలి ఆరోగ్యం విషమించడంతో మెరుగైన చికిత్స కోసం సింగపూర్ తరలించారు. బుధవారం రాత్రి ఆమెను పరీక్షించిన వైద్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. హుటాహుటినా పాస్‌పోర్టు ఏర్పాటు చేసి సింగపూర్ తరలించారు. గత 10 రోజుల నుంచి బాధితురాలు మృత్యువుతో పోరాడుతున్న విషయం తెలిసిందే. అయితే దుండగులు రేప్ అనంతరం రాడ్ తో ఆమె కడుపుపై విపరీతంగా కొట్టడంతో కడుపులో పేగులన్నీ చిద్రమయ్యాయి. వాటి స్థానంలో కొత్తగా పేగులను అమర్చేందుకు, మెరుగైన చికిత్స అందించేందుకు ఈ తరలింపు జరిగింది. అంతేకాకుండా సింగపూర్ అయితే ప్రయాణ కాలం తక్కువ ఉంటుందన్న ఉద్దేశంతో అక్కడి ప్రఖ్యాత మౌంట్ ఎలిజబెత్ హాస్పిటల్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
బాధితురాలిని చేర్పించనున్న సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పవూతిలోనే గతంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు కిడ్నీ వ్యాధికి విజయవంతంగా చికిత్స జరిగింది. బహుళ అవయవ మార్పిడిలో ఈ ఆస్పవూతికి మంచి పేరు ఉందని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బీడీ అథానీ చెప్పారు. బాధితురాలి చికిత్సకు అయ్యే ఖర్చును కేంద్రమే భరిస్తుంది. బాధితురాలి వెంట కుటుంబసభ్యులు, బంధువులు వెళ్లారు. గ్యాంగ్ రేప్ బాధితురాలు ఆరోగ్యం మెరుగుపడి క్షేమంగా ఉండాలని ఢిల్లీలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.