డిల్లీ గ్యాంగ్ రేప్: చితికిన బాదితురాలి జీవితం

 

డిల్లీలో క్రిందటి ఆదివారం రాత్రి మెడికల్ విద్యార్ధినిపై జరిగిన అమానుషమయిన సామూహిక అత్యాచారంకు నిరసనగా డిల్లీలో విద్యార్దులు, యువత, ప్రజలు గత మూడు రోజులుగా పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి నిందితులపై కటినచర్యలు తీసుకొని వెంటనే భాదితురాలికి న్యాయం చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసినదే. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లతో విద్యార్దీ ప్రతినిదుల చర్చలు, ప్రభుత్వ హామీలు, విద్యార్డులపై పోలీసుల లాటీ చార్జీలు, బాష్ప వాయు ప్రయోగాలు మొదలయిన వార్తలు కూడా నిత్యం చూస్తూనే ఉన్నాము.

 

ఇక, మరోపక్క బాధితురాలి పరిస్తితి ఇప్పటికీ చాలా ప్రమాదకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె శరీరంలో ఉన్న చిన్న ప్రేగులకు తీవ్ర ఇన్ఫెక్షన్ సోకడంతో డాక్టర్లు దానిని తొలగించేరు. మానవ శరీరంలో జీర్ణ ప్రక్రియని కొనసాగించే చిన్నప్రేగులు దాదాపు 21 అడుగుల పొడవు ఉంటాయి. డాక్టర్లు ఆమె చిన్న ప్రేగులలో కేవలం 3 అంగుళాలు పొడవు మినహా మిగిలిన దానిని మొత్తం ఆపరేషన్ చేసి తొలగించేయవలసి వచ్చింది.

 

మనం రోజూ తీసుకొనే ఆహరం పూర్తిగా జీర్ణం కావాలంటే దాదాపు 21 అడుగుల పొడవు అవసరమే. అప్పుడు మాత్రమే, అక్కడ జీర్ణ ప్రక్రియ పూర్తయ్యి ఆహారం నుండి శరీరానికి అవసరమయిన శక్తిని ఉత్పత్తి చేసే వివిధ రకాలయిన ప్రోటీన్లు వగైరాలు ఈ ప్రక్రియలో విడదీయబడి చిన్నప్రేగుల గోడలద్వారా శరీరంలో అన్ని భాగాలకు చేర్చబడుతుంది. అయితే, ప్రస్తుతం బాదితురాలికి కేవలం 3 అంగుళాలు పొడవున్న చిన్న ప్రేగు మాత్రమే మిగిలి ఉంది. అందువల్ల, ఆమె ఇక ఏ రకమయిన ఘనాహారం లేదా ద్రవాహారం నోటి ద్వారా ఎన్నడూ తీసుకోలేదు. ఆమె జీవించి ఉండేందుకు సెలయిన్ లేదా అటువంటి వాటి మీదే కొన్ని సంవత్సరాలవరకు ఆదారపడక తప్పదు. ఒకవేళ ఆమె పొరపాటున నోటి ద్వారా ఏ రూపంగానయినా ఆహరం తీసుకొన్నా లోపల చిన్న ప్రేగులు లేవు గనుక, వాటిని శరీరం నేరుగా బయటకి విసర్జించక తప్పదు. కనుక, డాక్టర్లు ఆమె శరీరంలో ఒక గొట్టం అమర్చవలసి వచ్చింది. దాని ద్వారా ఆమె తీసుకొన్న ఆహారం నేరుగా బయటకి వచ్చేస్తుంది.

 

నిన్నమొన్నటి వరకు ఏంతో హాయిగా బ్రతికిన ఒక అమాయకురాలయిన యువతి, మనుష్య రూపంలో తిరుగుతున్న క్రూర మృగాలకి బలయిపోయి ఇటువంటి దుస్తితికి జేరడం ఎవరి హృదయాలనయినా కలిచివేయక మానదు.

 

డాక్టర్ల అభిప్రాయం ప్రకారం, ఆమె పూర్తిగా కోలుకోనేందుకు ఒకటి లేదా రెండు సం.లు పట్టవచ్చును. అప్పుడు కేవలం అమెరికా వంటి దేశాలలో మాత్రమె అత్యంత ఖరీదయిన చిన్న ప్రేగుల మార్పిడి చికిత్స కోసం ప్రయత్నిస్తే ఆమె జీర్ణ వ్యవస్త బాగుపడవచ్చును. అయితే, మిగిలిన అవయవాల మార్పిడిలో దాదాపు 70 నుండి 80 శాతం వరకు విజయవంతం అవుతుండగా, ఈ చిన్న ప్రేగుల మార్పిడి చికిత్సలో మాత్రం కేవలం 20 నుండి 30 శాతం చికిత్సలు మాత్రమే విజయవంతం అవుతాయని డాక్టర్లు చెపుతున్నారు. అంటే, బాదితురాలికి భవిష్యత్ జీవితం అంతా ప్రశ్నార్దకమే అన్నమాట.

 

ఆమెకి ఇటువంటి దుస్తితి కల్పించిన దుర్మార్గులకు ఏమి శిక్ష విదిస్తే ఆమెకు న్యాయం జరుగుతుంది? అత్యాచారానికి గురయిన బాధకుతోడు, జీవితాంతం ఉండే ఈ శారీరిక బాద కూడా ఆమె భరించవలసి వచ్చినందుకు ఎవరిని బాద్యులను చేయాలి? నేరం చేసిన నేరస్తులనా? స్త్రీలకూ రక్షణ కలిపించని పోలీసులనా? సరయిన సమాజం ఏర్పరుచుకోలేని మన చేతకానితన్నానా?