దేశంలో నడుస్తున్న బ్రహ్మచారుల హవా..!
posted on Dec 22, 2012 @ 12:51PM
బిజెపి నరేంద్రమోడీని కాంగ్రెస్ రాహుల్ గాంధీని 2014 ఎన్నికల్లో తమ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన పక్షంలో వీరివురు పోటీ మాట పక్కన ఉంచితే ఇద్దరికీ ఒక దగ్గరి పోలిక ఉంది. అదే బ్రహ్మచర్యం. నరేంద్రమోడి ఇంతవరకు వివాహం చేసుకోలేడు. ఆయన బ్రహ్మచారిగానే ఇప్పటివరకు ఉన్నారు. బహుశా భవిష్యత్తులో కూడా ఆయన తన బ్రహ్మచర్యాన్ని కొనసాగించవచ్చు. అదే తరహాలో రాహుల్ గాంధీ కూడా బ్రహ్మచారే. ఆయన కూడా ఇంత వరకు పెళ్ళి చేసుకోలేదు. పెళ్ళి చేసుకోమని సలహా ఇచ్చే మిత్రులకు ఆయన చిరునవ్వే సమాధానం చెబుతుంది. అలాగే రాబోయే కాలమంతా బ్రహ్మచారుల మాయం కానుందా.
వీరబ్రహ్మంగారు చెప్పినట్టు బ్రహ్మచారుల శకం ప్రస్తుతం నడుస్తోంది. బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ బ్రహ్మచారి. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా వివాహం చేసుకోకుండా బ్రహ్మచారిణిగా కొనసాగుతుంది. ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా బ్రహ్మచారే. ఎన్డీయే మరో మిత్రపక్షనేత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా బ్రహ్మచారిణియే.
బ్రహ్మచారిణి జాబితాలోనే ఉన్న యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి కూడా బ్రహ్మచారిణియే (ఎస్టీలకు ఉద్యోగ ప్రమోషన్ల విషయంలో బిఎస్సీ చేపట్టిన బిల్లుకు బిజెపి కూడా ఓటు మద్దతు తెలిపింది). బ్రహ్మచారుల సంఘంలో వీరంతా సభ్యులే. ఒక్క మాయావతి మాత్రమే ప్రస్తుతానికి ఎన్డీయే మిత్రపక్షంగా లేరు. కానీ భవిష్యత్తులో ఎన్డీయే భాగస్వామిగా చేరేందుకు ఆమె తన సమ్మతిని తెలియజేయవచ్చు. కానీ తమ బ్రహ్మచారి సంఘం అధ్యక్షుడు నరేంద్రమోడి ప్రధానమంత్రిత్వం కట్టబెట్టిన పక్షంలో తన మద్దతును కూడా ఇస్తానని చెప్పడం రానున్నది బ్రహ్మచారుల పాలన అన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.