కవితకు నో మధ్యంతర బెయిల్!
posted on Apr 8, 2024 @ 10:51AM
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కుమారుడి పరీక్షల కారణంగా మధ్యంతర బెయిలు కోరుతూ ఆమె దాఖలు చేసుకున్న పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది.
కుమారుడి పరీక్షలు ఉన్నందున తనకు ఏప్రిల్ 16 వరకూ మధ్యంతర బెయిలు ఇవ్వాలని కోరుతూ కవిత దాఖలు చేసుకున్న పిటిషన్ ను కోర్టు తోపి పుచ్చింది. ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై వాదనలు విన్న ఈ నెల 4 తీర్పు రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. కవిత తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.
మ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై గురువారం (ఏప్రిల్ 4) విచారణ ముగిసింది. న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. తల్లిగా తన కుమారుడికి పరీక్షలు ఉన్నపుడు దగ్గర ఉండటం కవితకు అత్యవసరమని, పరీక్షల సందర్భంగా తల్లిగా నైతిక మద్దతు ఇవ్వాల్సి ఉంటుందని మనుసింఘ్వీ తన వాదన వినిపించారు. ఆ వాదనలను తిరస్కరిస్తూ కోర్టు సోమవారం కవిత బెయిలు పిటిషన్ ను తోసిపుచ్చింది.