దూకుడు పెంచిన జనసేన, టిడిపి ఉమ్మడి ప్రచారం
posted on Apr 8, 2024 @ 10:19AM
తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ఉమ్మడిగా ప్రచారం చేయనున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఈ నెల 10, 11వ తేదీల్లో జరిగే మూడో విడత ప్రజాగళంలో చంద్రబాబు- పవన్ కలిసి పాల్గొననున్నారు. 10న తణుకు, నిడదవోలు, 11వ తేదీన పి. గన్నవరం, అమలాపురంలో చంద్రబాబు, పవన్ కలిసి ఉమ్మడిగా ప్రచారం చేయనున్నట్లు ఇరు పార్టీల వర్గాల వెల్లడించాయి. ఈ నిర్ణయంతో రెండు పార్టీల శ్రేణుల్లో ఉత్తేజం కలుగుతోందని వారు అభిప్రాయం పడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ సమీపించడంతో ఎన్నికల గడువు దాటకమునుపే త్రి కూటమిలో భాగస్వామి అయిన జనసేనాని, చంద్రబాబు ఉమ్మడి ప్రచారం చేయాలని నిర్ణయించారు. పిఠాపురం నుంచి జనసేన పార్టీ ఎన్నికల ప్రచారం ప్రారంభింది. అనారోగ్య కారణాల రీత్యా పవన్ కళ్యాణ్ ఈ ఒక్క నియోజకవర్గం తప్పితే మరెక్కడా ప్రచారం చేయలేదు. కోలుకున్న తర్వాత అనకాపల్లి నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.