ముందస్తు మరణ సర్టిఫికెట్!
posted on Jul 29, 2022 @ 4:53PM
ఇంటికీ, భూమికీ సర్టిఫికెట్లు ఉన్నట్టే, పుట్టిన తేదీతో సర్టిఫికెట్ తీసుకోవడం ఉంటుంది. కానీ చిత్రంగా మరణ సర్టిఫికెట్ కూడా ఉంటుందని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా కి తెలియవచ్చింది! ఆయన ఈమధ్య తన ట్విటర్ అకౌంట్‌లో ఈ విచిత్ర సర్టిఫికెట్‌ను పోస్ట్ చేశారు. ఇది అమెరికా నార్త్ కరోలినా లోని ఒక పోర్టల్ లో ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. అసలు ఇలాంటివీ ఉంటాయని!
ఆ సర్టిఫికెట్‌లో కేవలం రెండు ఆప్షన్లే ఉన్నాయి. ఆన్‌లైన్‌లో దీన్ని డౌన్‌లోడ్ చేసుకున్నవారు వాటిలో ఒకదాన్ని ఎంచుకోవాలి. అంటే ఈ సర్టిఫికెట్ ఎవరికి తీసుకుంటున్నారన్నది స్పష్టం చేయాలి. అలా ఉన్నపుడు మనం సహజంగా మనవాళ్లదో, బంధువులదో, స్నేహితులదో పేరు రాయాలనే ఉంటుందని అనుకుంటాం. కానీ అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది.
మొదటి ఆప్షన్ .. మీకా? రెండో ఆప్షన్ .. మరెవరికైనానా? ... అని!
మరణించిన తర్వాత జీవితం మీద అపార నమ్మకం ఉన్నది మనమే కాదు విదేశీయులు ప్రగాఢంగా విశ్వ సిస్తారన్నది ఈ సర్టిఫికెట్ సుస్పష్టం చేస్తోందని ఎవరో దానికి కాప్షన్‌గానూ పెట్టారు. ఈ పోస్టును ఇప్పటికి 21 లక్షల మంది చూశారట! మొదటిది .. మైసెల్ఫ్ అని క్లిక్ చేయడమే మంచిదేమోనని ఒక వ్యూయర్ తమాషాగా సమాధానం ఇచ్చాడు.
చిత్రమేమంటే అమెరికాలో స్కూలు పిల్లలు ఎవరయినా స్కూలు డుమ్మా కొట్టాలంటే.. అంటే ఎవరయినా మరణిస్తే సెలవు పెట్టాలంటే ఇలాంటి ఆన్‌లైన్ లో ఈ సర్టిఫికెట్‌ను పూర్తిచేయాలేమో అని మరొకరు అనుమానం వ్యక్తం చేశారు! ఏమైనా ఇది నెటిజెన్లను విపరీతంగా ఆకట్టుకున్న పోస్టు.