దాల్మియా ప్లేస్ లో సౌరబ్ గంగూలీ
posted on Sep 23, 2015 @ 8:06PM
బీసీసీఐ ఛైర్మన్ జగ్ మోహన్ దాల్మియా మరణించడంతో అటు బీసీసీఐ అధ్యక్ష పదవికి, ఇటు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నడుస్తోంది, ఎవరికి వాళ్లు ఈ పదవులను దక్కించుకునేందుకు లాబీయింగ్ చేసుకుంటున్నారు, బీసీసీఐను దక్కించుకునేందుకు మాజీ అధ్యక్షులు శ్రీనివాసన్, శరద్ పవార్ వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తుంటే, ఇండియన్ టీమ్ మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ బీసీఏ పగ్గాల కోసం పెద్దఎత్తున లాబీయింగ్ చేస్తున్నారు. దాల్మియాకు నమ్మినబంటైన గంగూలీ...ఆయన హయాంలోనే ఇండియన్ టీమ్ కు కెప్టెన్ గా ఓ వెలుగు వెలిగాడు, ఇప్పుడు ఆయన స్థానంలో బీసీఏ పగ్గాలు అందుకోవాలని చూస్తున్నారు, అయితే బెంగాల్ సీఎం అనుగ్రహం ఉంటేనే ఈ పదవి దక్కుతుందంటున్నారు, మమతా బెనర్జీ కూడా గంగూలీ పట్ల సానుకూలంగానే ఉన్నారనే వార్తలు వస్తున్నాయి, అదే నిజమైతే బీసీఏ చీఫ్ గంగూలీయే కావడం ఖాయం