తెలుగుదేశంలోకి కృష్ణాజిల్లా వైసీపీ నేత
posted on Sep 23, 2015 @ 7:35PM
కృష్ణాజిల్లా వైసీపీ నేత బూరగడ్డ వేదవ్యాస్... త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరతారనే వార్తలు వినిపిస్తున్నాయి, టీడీపీలో చేరడానికి ఆ పార్టీ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, మంచి ముహూర్తం చూసుకుని పసుపు కండువా కప్పుకోవడమేనంటున్నారు.అయితే మొన్నటివరకు వేదవ్యాస్ బీజేపీలో చేరేందుకు ప్రయత్నించినట్లు టాక్ ఉంది, కానీ చివరికి తెలుగుదేశంలో చేరాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. గతంలో ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వేదవ్యాస్...చిరంజీవి రాజకీయాల్లోకి రావడంతో పీఆర్పీలో చేరారు, ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయడంతో తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చారు. అయితే 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన వేదవ్యాస్ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు, దాంతో మరోసారి పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.