దళితులు ఉద్యమించాలి..దేవినేని పిలుపు
posted on Jul 26, 2022 @ 11:06AM
అధికారంలోకి వచ్చేముందు ఎస్సీ, ఎస్టీలను ఆదుకుంటామని భారీ హామీలిచ్చిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆ తర్వాత హామీలను నిర్లక్ష్యం చేశారని తెలుగు దేశం నాయకులు ఆరోపిస్తున్నారు. విజయవాడలో దళిత గర్జన నేపథ్యంలో టీడీపీ నాయకులను పోలీసులు గృహనిర్భంధం చేశారు. ఈ సందర్భంగా తెలుగు దేశం సీనియర్ నేత దేవినేని ఉమ మాట్లాడుతూ, దళితుల కోసం కేటా యించిన వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులను వైసీపీ నాయకులు దారి మళ్లించారని ఆరోపించారు. దళితులపట్ల వైసీపీ ప్రభుత్వ విధా నాలు దారుణంగా ఉన్నాయని, ఈ ప్రభుత్వంపై దళితులు యుద్ధానికి సన్నద్ధం కావాలని టీడీపీ నేత దేవినేని పిలుపునిచ్చారు.
దళితులు తమకు ప్రభుత్వం తమను ఘోరంగా మోసంచేసిందని ఆరోపిస్తూ భారీ నినాదాలతో దళిత గర్జన చేపట్టింది. విజయవాడలో దళిత గర్జన నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి టీడీపీ నేత లను బయ టికి రాకుండా గృహనిర్భంధం చేశారు. మాజీమంత్రి దేవినేని ఉమాతో సహా పలువురు తెలుగు దేశం నేతలను గృహనిర్భంధం చేశారు. పట్టణంలోని ధర్నాచౌక్ వద్ద భారీగా పోలీసు బ్యారి కెడ్లు ఏర్పాటు చేసి దళిత నాయకులను అడ్డుకుంటున్నారు. ధర్నాచౌక్ చేరుకునే పలుమార్గాలను పోలీసులు బ్యారి కేడ్లతో మూసివేశారు.
ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగార్చిందని, దళితులపై ప్రతీ రోజూ దాడులు జరుగుతున్నాయనిమండిపడ్డారు. సబ్‌ప్లాన్ నిధులను తిరిగి రాబట్టి దళితుల సంక్షేమా నికి కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో ఎస్సీలకు భూమి కొనుగోలు పథకాన్ని ప్రవేశ పెట్టినా దాన్ని జగన్ సర్కార్ నిర్వీర్యం చేసిందని ఉమా మండిపడ్డారు. అంతేగాక వెనుకబడిన తరగతు లకు చెందిన విద్యార్ధులకు ఎంతో ఉపయోగపడే అంబేద్కర్ విద్యా పథకం వైసీపీ ప్రభుత్వం నిలిపివేసి వారికి ద్రోహం చేసిందని టీడీపీ నేత ఆరోపించారు. ఈ విధంగా దళితులను దారుణంగా మోసం చేస్తున్న జగన్ సర్కార్ పై యుద్ధం చేయాలని దేవినేని పిలుపునిచ్చారు.