మీ పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారు?.. టీచర్లకు బొత్స ప్రశ్న
posted on Jul 26, 2022 @ 11:33AM
అధికారంలో ఉన్నవారి మీద నిత్యం ఉద్యమించాలన్న ఆలోచన, తమ డిమాండ్లతో రోడ్లమీదకు రావడం కాకుండా ఉపాధ్యాయుల సంఘాలు ప్రభుత్వ విధానాలను అర్ధరహితంగా వ్యతిరేకించడం సరికాదని ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యానారారాయణ అన్నారు. అమరావతి సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అసలు ఉద్యమాలు చేస్తున్న ఉపాధ్యాయులు వారి పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ విధానాలను ఉపాధ్యా యులకు ప్రశ్నించే హక్కు లేదన్నారు.
పిల్లలు బాగా చదువుకోవాలని అందరికీ ఉంటుంది. మంచి చదువు చదివించాలని తల్లిదండ్రులకూ ఉం టుంది. కానీ పేదవాడి పిల్లలు అలానే పేదరికంలోనే ఉండిపోవడం ఎంతవరకూ సబబు ఆలోచించాలని మంత్రి అన్నారు. విద్యను అందరికీ అందజేయాలన్నగొప్పలక్ష్యంతోనే జాతీయ విద్యావిధానంలో భాగంగా పాఠశాలల విలీనాన్ని ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతను దృష్టిలో పెట్టుకునే సంస్కరణలు చేపడుతున్నామన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని, ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఉద్యోగరీత్యా వారికి ఎలాంటి ఇబ్బందు లు వచ్చినా వాటిపై పోరాడటంలో తప్పులేదు, సవరణలూ చేపట్టవచ్చు. కానీ విధానాల మార్పు గురించి సంఘాలు ప్రశ్నించడం సబబు కాదని బొత్స అన్నారు.
గతంలో 1 నుంచి 5వ తరగతి వరకు ఒకే క్లాస్ రూం, ఒకే టీచరు ఉన్న స్కూళ్లు రాష్ట్రంలో ఎన్ని ఉన్నా యో వారే చెప్పాలి. ఆ విధంగా ఉండకూడదనే మార్పులు తెచ్చాం. 3 నుంచే సబ్జెక్ట్ టీచర్లను తెచ్చామన్నారు. పథకాలు అమలుపెట్టిన వెంటనే మంచి ఫలితాలు ఆశించరాదని, ప్రయివేటు పాఠశాలల విధానాన్ని పరిశీలిస్తున్నపుడు ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఉపాధ్యాయులు విద్యార్ధులపై ప్రత్యేకదృష్టి పెట్టి వారి అభి వృద్ధికి పాటుపడాలన్నారు. ఉపాధ్యాయ సంఘాలతో మంచి వాతావర ణంలో చర్చలు జరిగాయి. వాళ్లు సంతోషంగా రిసీవ్ చేసుకున్నారు. ఉద్యమాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేం నమ్ముతాం. 5800 స్కూళ్లు మ్యాపింగ్ చేస్తే 268 స్కూళ్లపై అభ్యంతరాలు వచ్చాయి. మేం అడిగితేనే ఎమ్మెల్యేలు అభ్యంతరాలు తెలియజేశారు. అంటే మిగతా వన్నీ ఓకే కదా. అభ్యంతరాలు పరిశీలించి అవసరమైతే మార్పులు చేస్తామని బొత్స అన్నారు. పాఠ్య పుస్తకాల జాప్యా నికి ప్రైవేటు పాఠశాలల ఇండెంట్ లోపమే కారణమని చెప్పారు. 15 రోజుల్లో అన్ని ప్రైవేటు పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తామన్నారు.