రాణూ... వదిలి వెళిపోయావా!
posted on Nov 3, 2022 @ 9:56AM
పిల్లలతోపాటు పిల్లినో, కుక్కనో పెంచుకోవడం చాలామందికి సరదా. కానీ చాలా గ్రామాల్లో గేదెల్ని, ఆవుల్ని కూడా తమ సంతానంగా భావించేవారు ఇప్పటికీ ఉన్నారు. వాటితో పనిచేయించుకోవడమే కాకుండా వాటి నుంచి లబ్ధి పొందడమే కాకుండా వాటి సంరక్షణ విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుం టూంటారు. దానికి ఏ మాత్రం ఆరోగ్యం సరిగా లేదని తెలిసినా వెంటనే సంబంధిత డాక్టర్ ని పిలిపించ డమూ వైద్యం చేయించడంలోనూ చాలా జాగ్రత్తలు పాటిస్తుంటారు. వాటికి పండగల్లో బొట్లు పెట్టి పూజలు చేయడం అన్నీ మామూలే.
అలా సొంత బిడ్డలా చూసుకుంటూండడంలో వాటికీ ఆ యజమాని పట్ల ఏర్పడే బంధం కూడా చిత్రంగా ఉంటుంది. ఆయనో లేదా ఆ యింటివారు కాకుండా ఎవరు దగ్గరికి వచ్చినా అంగీకరించదు. పొడవ డానికి ప్రయత్నిస్తుంది. యజమాని పక్కనే ఉంటే చాలా మంచిగా వ్యవహరిస్తుంది. ఇదేనా నిన్న పొడవ బోయింది అనిపిస్తుంది. అదుగో అంతగా ఉండే బంధం తెగిపోతే యజమానితో పాటు ఆయన తోటివారు, చుట్టుపక్కలవారూ ఎంతో బాధపడతారు.
మధ్యప్రదేశ్ షాజాన్ పూర్ కి ఛెందిన భన్వర్ గత ఇరవయ్యేళ్లుగా ఒక ఆవును పెంచుకుంటున్నాడు. దానికి రాణూ అని పేరు పెట్టి పిలుస్తుండేవాడు. అదంటే ఆయనకు ఎంతో ప్రాణం. మొన్న హఠాత్తుగా ఆ రాణూ మరణించింది. భన్వర్ దుఖానికి అంతులేదు. ఇన్నాళ్లూ తనకు తోడుగా ఉన్న రాణూ మర ణించిందని తెగ బాధపడ్డాడు. దాని అంత్య క్రియలు ఊరి వారంతా కలిసి ఎంతో ఘనంగానే చేశారు. ఏకంగా ఇరవై చీరలు దాని పై కప్పి ఘనంగా ఊరేగిస్తూ తీసికెళ్లారు. రాణూ గురించి ఇక భన్వర్ కి ఉంది చిన్నపాటి గుర్తులే. వాటినే అందరితో ప్రస్తుతం పంచుకుంటున్నాడు,