కరోనా విజృంభణ.. నాలుగో స్థానానికి చేరువలో భారత్!!
posted on Jun 8, 2020 @ 10:21AM
భారత్ లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 9,983 మందికి కరోనా పాజిటివ్ గా తేలిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో గత 24 గంటల్లో కరోనాతో 206 మంది మరణించారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,56,611కి చేరగా, మృతుల సంఖ్య 7,135కి చేరుకుంది. ఇప్పటివరకు 1,24,095 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా.. ప్రస్తుతం 1,25,381 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కరోనా కేసుల్లో స్పెయిన్‌ను దాటి భారత్ 5వ స్థానానికి చేరింది. ప్రస్తుతం దాదాపు 2,86,000 కేసులతో యూకే నాలుగో స్థానంలో ఉండగా.. 2,41,000 కేసులతో స్పెయిన్ ఆరో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్న భారత్.. కరోనా ఉధృతి ఇలాగే కొనసాగితే.. మూడు నాలుగు రోజుల్లో నాలుగో స్థానానికి చేరే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.