ఖంగుతిన్న స్పీకర్.. ఎంపీల ఫుడ్ సబ్సిడీతో సంవత్సరానికి రూ.17 కోట్ల భారం
posted on Dec 16, 2019 @ 1:36PM
పార్లమెంటు క్యాంటీన్ లో భారీ రాయితీ పై తింటూ వచ్చారు మన ఎంపీలు. ఇటీవల పార్లమెంట్ ఖర్చుల పై ఆరా తీస్తే క్యాంటీన్ ఖర్చు చూసి స్పీకర్ ఆశ్చర్యపోయారు, ఏటా కోట్లాది రూపాయల చెల్లిస్తున్నారు. అందుకే రాయితీకి గుడ్ బై చెప్పాలను నిర్ణయించారు. వచ్చే పార్లమెంటు సమావేశాల నుంచి ఎంపీలకు రాయితీపై ఫుడ్ సర్వ్ చేయరు. అసలు ధర ఎంత ఉంటే అంత చెల్లించాల్సిందే. పార్లమెంట్ క్యాంటీన్ లో ఎంపీల ఫుడ్ సబ్సిడీ భారం ఏటా రూ.17 కోట్లకి చేరింది.
గత ఐదేళ్లలో రూ.60 కోట్ల 70 లక్షల వరకు ప్రభుత్వం చెల్లించింది. ఇంత ఖర్చా అని ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టింది. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అన్ని రాజకీయ పార్టీల నేతలతో సబ్సిడీ పై అభిప్రాయాలు తీసుకున్నారు. అందరి ఏకాభిప్రాయంతో పార్లమెంటు క్యాంటీన్ లో అసలు ధరలకే ఫుడ్స్ చేయాలని నిర్ణయించారు. దీంతో వచ్చే సమావేశాల్లో ఎంపీలకూ భోజనం బిల్ భారీగానే పడనుంది. పార్లమెంటులో ఎంపీలు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన మధ్యాహ్న భోజనం ఆరగించిన చెల్లించేది చాలా తక్కువ.
చికెన్ బిర్యానీ తినాలంటే బయట రెండు వందల వరకు ఖర్చు అవుతుంది. కానీ మన ఎంపీలు పార్లమెంటు క్యాంటీన్ లో జస్ట్ అరవై రూపాయలు చెల్లిస్తే చాలు టేస్టీ బిరియాని ముందుండేది. ఒక్క బిర్యానీనే కాదు మటన్ కర్రీ కూడా కేవలం నలభై ఐదు రూపాయలే. భోజనమైతే రూ.7 రూపాయలు, తందూరి చికెన్ రూ.60 రూపాయలకే సాగుచేసేవారు. ఇదే ఫుడ్ అసలు ధర రూ.350 కు పై మాటే. 2015 లోనే పార్లమెంట్ క్యాంటీన్ లో ఎంపీలకు సబ్సిడీ ఫుడ్ అందించడం పై పెద్దెత్తున విమర్శలొచ్చాయి. 90 శాతానికి పైగా ఎంపీలు ఆర్థికంగా కోటీశ్వరులే, కనీస భోజనానికి కూడా డబ్బులు చెల్లించలేని స్థితిలో ఉన్నారా అంటూ విమర్శలు కూడా వచ్చాయి. సోషల్ మీడియాలో పేద ఎంపీలంటూ సెటైర్ లు వినిపించాయి. దీంతో డిసెంబర్ 2015 లో అప్పటి లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటన ఒకటి విడుదల చేశారు. పార్లమెంట్ లోని క్యాంటీన్ లాభనష్టాల పై పనిచేయదన్నారు. అయినా అసలు దరకే సర్వ్ చేసేలా చూస్తామన్నారు. అయితే అది పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదు. తాజాగా శీతాకాల సమావేశాల్లో స్పీకర్ చొరవతో ఇప్పుడు ఆచరణలోకొచ్చింది.