Read more!

మోడీపై కాంగ్రెస్ ‘మహిళాస్త్రం’

 

 

 

బీజేపీ ప్రధాన అభ్యర్థి నరేంద్రమోడీని బద్నామ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ శాయశక్తులా కృషి చేస్తోంది. గోద్రా అల్లర్లు మోడీయే దగ్గరుండి చేయించారన్నట్టు హడావిడి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మోడీ పెళ్ళికి సంబంధించి కూడా మాటల దాడి చేస్తూ వచ్చింది. నిన్నటి వరకూ మోడీకి పెళ్ళయినా పెళ్ళి కాలేదని చెబుతున్నాడు. ఆ వివరాలు బయటపెట్టాలంటూ కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెట్టింది. ఇప్పుడు మోడీయే స్వయంగా తన పెళ్ళికి సంబంధించిన వివరాలను బయటపెట్టడంతో కాంగ్రెస్ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. తమ దగ్గర ఉన్న ఒక అస్త్రం పోయిందే అని బాధపడింది. అంతలోనే తేరుకుని మరో అస్త్రాన్ని బయటకి తీసింది. ఆ అస్త్రం పేరు ‘మహిళాస్త్రం’.


దేశంలో కాస్తంత నోరున్న కాంగ్రెస్ మహిళా నాయకులను రంగంలోకి దించింది. సొంత భార్యకే న్యాయం చేయలేని మోడీ దేశంలోని మహిళలకు ఏం న్యాయం చేస్తాడని వాళ్ళచేత స్టేట్‌మెంట్లు ఇప్పించింది. మన రాష్ట్రం నుంచి మోడీ మీద మహిళాస్త్రాన్ని సంధించే బాధ్యతని తెలంగాణ ఆడపడుచు రేణుకా చౌదరి స్వీకరించారు. మోడీని మహిళా వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మొత్తమ్మీద ఈ సాకు చూపించి మోడీని మహిళలకు దూరం చేయాలన్న ప్లాన్‌లో కాంగ్రెస్ పార్టీ వుంది. ఏమవుతుందో చూడాలి.