నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
posted on Nov 12, 2025 @ 2:31PM
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లున్నారు. ఇవాళ రాత్రి 7 గంటలకు ఆయన హస్తినకు బయల్థేరుతారు. రేపు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ అగ్రనేతలను ముఖ్యమంత్రి కలిసే అవకాశం ఉంది. రేపు ఇండో యుఎస్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు.
డిసెంబర్ 8,9 తేదీల్లో రైజింగ్ ఇండియాలో భాగంగా హైదరాబాద్ లో ఇండో, యూఎస్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఈ సమ్మిట్ కు వచ్చే వివిధ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి భేటీ అయి వారిని తెలంగాణకు ఆహ్వానించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, స్థానిక సంస్థల ఎన్నికలు, డీసీసీల నియామకం ఏఐసీసీ నేతలోతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌కు అనుకులంగా ఉండటంతో సీఎం హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.