పేదలకు తొలిసారి పక్కా ఇళ్లు నిర్మించిన వ్యక్తి ఎన్టీఆర్ : సీఎం చంద్రబాబు
posted on Nov 12, 2025 @ 12:50PM
ఏపీలో 3 లక్షల ఇళ్ల గృహప్రవేశాలకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం దేవగుడిపల్లిలో లబ్ధిదారులు హేమలత, షేక్ ముంతాజ్ బేగంలకు ఇంటి తాళలను ముఖ్యమంత్రి అప్పగించారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో గృహ ప్రవేశాలను సీఎం వర్చువల్‌గా ప్రారంభించారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత తనదని తెలిపారు.
2029 నాటికి ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్ఫష్టం చేశారు. అధునాతన హంగులు, సకల సౌకర్యాలలో ఇళ్లను నిర్మించిన ఘటన కూటమి ప్రభుత్వానిదేనని తెలిపారు. ప్రజల రుణం తీర్చుకునేందుకు ప్రభుత్వం రాత్రింబళ్లు కష్టపడి పనిచేస్తోందని పేర్కొన్నారు. ఇల్లు అంటే నాలుగు గోడలు కాదు.. భవిష్యత్తుకు భద్రత ముఖ్యమంత్రి తెలిపారు.. పేదలకు మొదటి సారి పక్కా ఇళ్లు నిర్మించిన వ్యక్తి ఎన్టీఆర్ అని సీఎం చెప్పారు.పేదోడికి కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో పుట్టిన తెలుగు దేశం పార్టీ అని వెల్లడించారు.