టిటిడీ ప్రాణదాన ట్రస్ట్ కు రూ. కోటి విరాళం
posted on Aug 7, 2025 @ 9:47AM
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వేంకటేశ్వర ప్రాణదానం ట్రస్ట్ కి సీకేపీసీ ప్రాపర్టీస్ ఎండీ చిరాగ్ పురుషోత్తం కోటి రూపాయల విరాళాన్ని అందించారు. దీనిపై ఆయనను అభినందిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు ఎక్స్ వేదికగా ఆయనను అభినందించారు. చిరాగ్ పురుషోత్తం, మంత్రి అనగాని సత్యప్రసాద్ సమక్షంలో టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఈ విరాళాన్ని అందజేశారు.
పేద ప్రజలకు ఉచితంగా మెదడు, గుండె, మూత్రపిండాల శస్త్ర చికిత్సలను అందించే ప్రాణదానం ట్రస్ట్ సేవా దృక్పథానికి చిరాగ్ పురుషోత్తం ఇచ్చిన విరాళం ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని బీఆర్ నాయుడు పేర్కొన్నారు. పేదలను ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించేందుకు ప్రాణదాన ట్రస్ట్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తున్న ఉచిత వైద్య సేవలను ఈ సందర్భంగా చిరాగ్ పురుషోత్తం ప్రశంసించారు.
గుండె, మూత్రపిండాలు, మెదడు మొదలైన ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న అనేకమంది పేదలకు ఉచిత సేవలందిస్తున్న ప్రాణదాన ట్రస్ట్ కు ట్రస్ట్ కు మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో రూ. కోటి విరాళం అందజేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.