చిరుపై రాళ్ళ దాడి

 

 

 

మాజీ మెగాస్టార్, కేంద్ర మంత్రి చిరంజీవికి వరుస చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఈ మధ్య కురిసిన వర్షాలు, వరదల బారిన పడి తీవ్రంగా నష్టపోయిన సీమాంధ్ర వాసులను పరామర్శించడం ద్వారా అక్కడి ప్రజల మనసులలో తాను కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందాలని చిరంజీవి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో శుభమా అని పరామర్శలు ప్రారంభించిన చిరంజీవికి ఆదిలోనే అపశకునం ఎదురైంది. పడవ ఎక్కబోయిన చిరంజీవి నీళ్ళలో జారిపడిపోయారు.


తాజాగా, ఈ రోజు ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్ళిన చిరంజీవిని సమైక్య నినాదాలు చేస్తూ విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. చిరంజీవిపైకి రాళ్ళు విసిరారు. అదృష్టవశాత్తూ చిరంజీవికి రాళ్ళు తగల్లేదు. భద్రతా సిబ్బంది సమైక్యవాదుల్ని నిలువరించారు. అనంతరం చిరంజీవిని జాగ్రత్తగా అక్కడినుంచి తరలించారు. చిరంజీవి లాంటి స్టార్ ఇమేజ్ వున్న వ్యక్తికి ఇలాంటి అనుభవాలు చాలా ఇబ్బందికరంగా వుంటాయి.