కిరణ్ పార్టీ పెడతానని చెప్పలేదు

 

 

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీని స్థాపించబోతున్నాడనే వార్తలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశాలు అవుతున్నాయి. సమైక్యవాదపు హీరోగా కిరణ్ కుమార్ రెడ్డి సొంతంగా ఇమేజ్ తెచ్చుకొన్న నేపథ్యంలో ఆయన కొత్తగా పార్టీ పెట్టినా సక్సెస్ అవుతాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలు, కిరణ్ కు జరుగుతున్న అవమానాలు కూడా కొత్త పార్టీకి బీజాలు వేస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో కిరణ్ పార్టీ స్థాపిస్తాడనే వార్తలకు మరింత ఊపు వస్తోంది. ఇక కిరణ్ ను పదవి నుంచి తొలగించబోతున్నారన్న వార్తలు కూడా కొత్త పార్టీ ఊహాగానాలకు మరింత ఊతమిస్తున్నాయి.

 

 

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తరపున మంత్రి శైలజానాద్ ఒక ఆసక్తికరమైన ప్రకటన చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడూ పార్టీ పెడతానని చెప్పలేదని ఆయన అన్నారు.అలాగే రాష్ట్ర విబజనను అడ్డుకుంటానని ముఖ్యమంత్రి చెప్పారే కాని, త్యాగం చేస్తానని అనలేదని అంటున్నారు. రాజ్యాంగం ప్రకారమే రాష్ట్రాల ఏర్పాటు జరగాలి తప్ప రాజ్యాంగ విరుద్దంగా జరగరాదని శైలజానాద్ అన్నారు.