తెలంగాణలో రూ.80 వేల కోట్లు పెట్టుబడులు
posted on Aug 9, 2025 @ 7:36PM
తెలంగాణలో రూ.80 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ముందుకు వచ్చింది. ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్ సింగ్ బృందం ఇవాళ జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి విద్యుత్ ఉత్తత్తి రంగంలో పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 6,700 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ఉత్పత్తికి అవకాశం ఉందని సీఎంకు ఎన్టీపీసీ బృందం తెలిపింది.
దీంతో పెట్టుబడులు పెట్టేందుకు అన్ని విధాలా సహకరిస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. సోలార్, పవన విద్యుత్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు ఎన్టీపీసీ సుముఖత తెలిపింది. రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి రంగంలో పెట్టుబడులకు ఎన్టీపీసీ సుముఖంగా ఉన్నట్లు ఈ సందర్భంగా ఆ ప్రతినిధి బృందం తెలిపింది. ప్రధానంగా సోలార్, విండ్ విద్యుత్ ప్రాజెక్టుల్లో దాదాపు 80 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్ సింగ్ వివరించారు.