సియం మార్పు ఖాయమా..?

 

కేంద్ర తీసుకుంటున్న ప్రతినిర్ణయాన్ని తప్పుపడుతూ అధిష్టానానికి కొరకరాని కొయ్యగా తయారైన సియం కిరణ్‌ను త్వరలో తప్పించనున్నారన్న వార్త కాంగ్రెస్‌ వర్గాల్లో జోరుగా వినిపిస్తుంది. ఇప్పటికే కొత్త సియంగా కన్నా లక్ష్మీ నారాయణ పేరు వినిపిస్తున్న ఆయన మాత్రం ఆ వార్తలను ఖండిచారు. పార్టీలో వివాద రహితుడిగా పేరున్న కన్నాకు అధిష్టానం అండదండలు కూడా పుష్కలంగా ఉన్నట్టు సమాచారం.


తొలుత ఈ అవకాశం కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇచ్చినా ప్రస్థుతం ఉన్న పరిస్థితుల్లో ఆ పదవి ముళ్ల కిరీటమే అని ఆయన ఆ ఆఫర్‌ ను తిరస్కరించారు. దీంతో కన్నానే కొత్త ముఖ్యమంత్రిగా సరైన వ్యక్తిగా భావిస్తున్నట్టుగా సమాచారం. అందులో భాగంగానే  గత వారం ఆయనను కాంగ్రెస్‌ అధినేత్రి, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ స్వయంగా ఆయనను ఢిల్లీ పిలిపించుకుని మంతనాలు జరిపారు.

అయితే ఆ తరువాత కూడా సియం మార్పు వార్తలు ఖండిచిన కన్నా తాజాగా రాష్ట్ర గవర్నర్‌ను కలవడంతో మరో సారి సియం మార్పు వార్త తెర మీదకు వచ్చింది. ఇలా వరుసగా జరుగుతున్న పరిణామాలతో రాష్ట్రంలో సియం మార్పు తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.