విభజనపై సుప్రింలొ మరో పిటిషన్
posted on Nov 24, 2013 8:58AM
రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ సుప్రిం కోర్టులొ మరో పిటిషన్ దాఖలైంది. ఇప్పటికే వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయిలో సమైక్యాంద్ర కోసం పర్యటనలు చేస్తుండగా ఇప్పుడు అదే పార్టీకి చెందిన మరో నేత సుప్రిం కోర్టును ఆశ్రయించారు. విభజనపై ఏ పార్టీ స్పష్టమైన వైఖరిని కనబర్చకముందే కేంద్ర నిర్ణయం తీసుకోవటాన్ని తప్పుపడుతూ కనుమూరి రఘురామకృష్ఱంరాజు సుప్రింలో పిటిషన్‌ను దాఖ లు చేశారు.
రాజ్యాంగ విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రం విభజి స్తుందంటూ ఆ యన దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆర్టికల్ 371డీ, కేంద్రంగా తనకు అనుకూలంగా వాడుకుంటుందని ఆయన పిటిషన్‌లో ఆరోపించారు. అయితే ఆయన పార్టీలో చేరక మునుపే సుప్రింలో పిటిషన్ వేశారు. తరవాత వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటం నచ్చి ఆయన పార్టీలో చేరుతున్నట్టుగా ప్రకటించారు.