ఇక యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. ఆర్బీఐ
posted on Aug 29, 2022 @ 4:32PM
యుపిఐ చెల్లింపులు దేశంలో ఇప్పుడు కొత్తకాదు. నగదు లావాదేవీలు యుపిఐ ఇపుడు మరింత సులభ తరం చేసింది. అంతేగాక, అనేక రంగాలకు చెందిన వారి వాణిజ్య, వ్యాపార అవకాశాలకు మరింత వీలు కల్పించింది. అయితే దేశంలో ఇపుడు ఆర్బీఐ అలాంటి యుపీఐ చెల్లింపుల మీద చార్జీల మోతకు సిద్ధపడింది. అయితే ఈ విషయంలో ఆర్బీఐ ప్రజాభిప్రాయం కోరనుంది.
దీనిపై దేశంలో చర్చకు సెంట్రల్ బ్యాంక్ ప్రత్యేక పత్రం విడుదల చేసింది. రిజర్వ్ బ్యాంక్ సాధారణ ప్రజల అభిప్రాయాలను ఇప్పటికే తెలుసుకున్నది. యుపిఐ ద్వారా చేస్తున్న చెల్లింపులపై ఎంత ఫీజు వసూలు చేయాలన్నది ఇంకా చర్చించాల్సి ఉన్నది. ఈ పరిస్థితుల్లో సమీప భవిష్యత్తులో యుపీఐ చెల్లింపు లపై కొంత ఫీజు చెల్లించవలసి వస్తుంది. దేశంలో చెల్లింపుల ప్రక్రియ సంబంధించిన వ్యయం రికవర్ చేయ డానికి, ఆర్బీఐ సిద్ధపడింది. యూపీఐ కూడా ఐఎంపిఎస్ వలె నిధుల బదిలీ విధానమని ఆర్బీఐ పేర్కొన్నది. కనుక, ఐఎంపిఎస్ వలె అది కూడా ఛార్జ్ చేయాలన్నది. అయితే పలు రకాల మొత్తాలకు పలు విధాలుగా ఈ ఛార్జీలు ఉంటాయన్నది.
చెల్లింపులు సత్వరంగా, సక్రమంగా జరిగినదీ లేనిదీ నిర్ధారించేందుకు, పిఎస్ ఓలు, బ్యాంకులు తగిన మౌలిక సదుపాయాలు కల్పించుకోవాలి. అప్పుడే లావాదేవీల్లో ఎలాంటి ఆటంకాలు ఉండవని ఆర్బీఐ పత్రం పేర్కొన్నది. అంతేగాక, ఎలాంటి ఆర్ధిక కార్యకలాపాల్లో, చెల్లింపుల విధానంలోసహా అన్నింటా, ఉచిత సేవలు చేయ డం న్యాయమనిపించుకోదని ఆర్బీఐ స్పష్టం చేసింది.