నాణ్యతా లోపానికి నిలువెత్తు నిదర్శనం..!
posted on Aug 29, 2022 @ 4:10PM
భారీ వర్షాలకు బెంగళూరు, మైసూరు హైవే నీట మునిగింది. పెద్ద సంఖ్యలో వాహనాలు నీటిలో చిక్కుకున్నాయి. బెంగళూరు నగరంలో భారీ వర్షాలకు నాణ్యతా లోపం కారణంగా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బెంగళూరు, మైసూరులను కలిపే మెగా రోడ్డు ప్రాజెక్ట్ పై భారీగా నీరు నిలిచింది.
గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైవేలోని పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఈ పరిస్థితిని రోడ్డు నిర్మాణంలో నాణ్యతా లోపమే కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు ఫేజుల్లో నిర్మించిన ఈ హైవే కోసం మొదటి ఫేజ్ కు రూ. 3,501 కోట్లు , రెండో ఫేజ్ కు రూ. 2,920 కోట్లు వ్యయం చేశారు.
కుంబల్ గోడు, బిడాది, రామనగర్, చన్నపట్నం సమీపంలోని హైవేలు పూర్తిగా లజమయం కావడంతో వాహనాలు కదలలేని పరిస్థితులు నెలకొన్నాయి. చాలా చోట్ల వాహనాలను దారి మళ్లించాల్సి వచ్చింది. నిజానికి హైవేలో వరదలు రావడం ఇదే మొదటిసారి కాదు. గత నెలలో కురిసిన వర్షాలకు కూడా మద్దూరు, మాండ్య సమీపంలోని రోడ్లన్నీ జలమయమై రాకపోకలు నిలిచిపోయాయ.
అంతే గాక, భారీగా వరద రావడంతో పలు వాహనాలు నీట మునిగాయి. హైవేపై వర్షం నీరు నిలవకుండా రోడ్లు చాలి. అయితే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన హైవేల విషయంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారనడానికి బెంగళూరు, మైసూరు జాతీయ రహదారే నిదర్శనమని విమర్శకులు అంటున్నారు.