టీటీడీకి చంద్రబాబు విరాళం
posted on Mar 21, 2021 @ 4:25PM
తిరుమల తిరుపతి దేవస్థానం అన్నదానం ట్రస్ట్‌కు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం విరాళం అందించింది. చంద్రబాబు మనవడు, నారా లోకేష్ దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా 30 లక్షల రూపాయల విరాళం అందించారు చంద్రబాబు. ప్రతియేటా దేవాన్ష్ బర్త్‌డే రోజున చంద్రబాబు కుటుంబసభ్యులు విరాళం ఇస్తున్నారు. చెక్కును టీటీడీ అధికారులకు పంపారు. దేవాన్ష్ బర్త్ డే కావడంతో ఆదివారం అతని పేరుపై టీటీడీ అన్నదానం చేసింది.
దేవాన్ష్ పుట్టిన రోజు కావడంతో తిరుమల శ్రీవారిని టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సమేతంగా శనివారం తిరుమలకు చేరుకున్నారు. ఆదివారం ఉదయం స్వామివారి ఆలయానికి చేరుకున్న చంద్రబాబు నాయుడుకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి, వారి తనయుడు దేవాన్ష్, ప్రముఖ సినీటుడు బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధర, ఇతర కుటుంబసభ్యులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు.అనంతరం తిరుమల శ్రీవారి అన్నదానం ట్రస్టుకు రూ. 30 లక్షలు విరాళంగా అందజేశారు.
దేవాన్ష్ పుట్టిన రోజు వేడుకలను గత నాలుగేళ్లుగా తిరుమల శ్రీవారి సన్నిధిలోనే నిర్వహిస్తున్నారు.
తమ కుటుంబంలో దేవాన్ష్ ఆనందం నింపాడంటూ లోకేష్.. నారా లోకేష్ తన కుమారుడు దేవాన్ష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలిపారు. దేవాన్ష్ తమ కుటుంబంలోకి వచ్చిన నాటి నుంచి ఎంతో ఆనందాలను పంచుతున్నాడని పేర్కొన్నారు. ఇలాంటి ఆనందాన్నిచ్చినందుకు థ్యాంక్యూ అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు