లోకేష్ కు చంద్రబాబు కర్తవ్య బోధ
posted on Oct 28, 2022 @ 10:29AM
సైన్స్ గణితం మీదా శ్రద్ధపెట్టమని చింటూకి వాళ్ల నాన్న ముద్దుగా చెప్పాడు, ఇక నుంచి నీ పనులు నువ్వే చేసుకోవడం నేర్చుకోమని పింకీకి వాళ్లమ్మ చెప్పారు, లెక్కల మాస్టార్ని తన బాధ్యతలూ కొద్ది రోజులు చూసుకోమని హెడ్మాస్టర్ చెప్పారు.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయకుడు తన కుమా రుడు నారా లోకేష్కి మంగళగిరి బాధ్యతలు పూర్తిగా చేపట్టి విజేతగా నిలవమని కర్తవ్యబోధ చేశారు.
ఏపీలో మళ్లీ అధికారంలోకి రావడానికి ఎంతో అవకాశం ఉండడంతో తెలుగు దేశం నాయకులు రెండిం తల ఉత్సాహం తో దూసుకుపోతున్నారు. అయితే ఈపర్యాయం తప్పకుండా అధికారంలోకి రావాలంటే అందరం మరింత శ్రమించాలని, మరింత జాగ్రత్తతో వ్యవహరించాలని ఏమాత్రం నిర్లఓ్యం తగదని ఇప్పటికే అధినే చంద్రబాబు టీడీపీ వర్గాలకు చిన్న క్లాస్ తీసుకున్నారు. ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని, ఆ ప్రాంత నాయకుల పనితీరును చంద్రబాబు సమీక్షించారు. లోకేష్ను మంగళగిరి బాధ్యతలను లోకేష్ చేతుల్లో పెట్టారు. అక్కడ చరిత్రను తిరగరా యాలని ఉత్సాహపరిచారు. అలాగే నియోజకవర్గాల ఇన్ ఛార్జ్లతో కూడా చంద్రబాబు వన్ టు వన్ సమావేశమై పరిస్థి తుల గురించి కూలంకషంగా చర్చించారు.
రాష్ట్రంలో జగన్ పాలనపట్ల విపరీత వ్యతిరేకత వెల్లువెత్తుతున్న ప్రస్తుత తరుణాన్ని పూర్తిగా వినియో గించుకుని అధికారంలోకి రావాలన్న లక్ష్యం తెలుగు దేశం నాయకుల్లో ఉంది. ప్రజలు అన్ని విధాలా వైసీపీ ప్రభుత్వాన్ని కొనసాగించేందుకు ఆసక్తి చూపడం లేదు. జగన్ అన్నివిధాలా విఫలమ య్యార న్నది ప్రజల వ్యతిరేకతే తెలియజేస్తోంది. ఇక ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే కాలం గడిపేయ కుండా పార్టీని మరింత బలోపేతం చేయడం, పార్టీని గెలిపించడం మీదనే దృష్టి పెట్టాలని టీడీపీ పార్టీ అధినేత సూచించారు.
మంగళగిరి నియోజకవర్గంపై ఇంచార్జ్ నారా లోకేష్ తో పార్టీ అధినేత సమీక్ష జరిపారు. పార్టీ కార్యక్ర మాలు, కమిటీల నియామకం, స్థానిక నేతల పనితీరు వంటి అంశాలపై తన వద్ద ఉన్న నివేదికల ఆధారంగా రివ్యూ చేశారు. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం తరువాత 1983,1985 ఎన్నికల్లో మంగళగిరిలో టిడిపి గెలిచిందని…1989 నుంచి 2009 వరకు జరిగిన 5 ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా మిత్రపక్షాలకు టిక్కెట్లు ఇవ్వాల్సి వచ్చిందని చంద్రబాబు అన్నారు.
పొత్తుల్లో రెండు దశాబ్దాల పాటు మంగళగిరి సీటు వేరు పార్టీలకు ఇచ్చుకుంటూ వచ్చిన కారణంగా నియోజకవర్గంలో అప్పట్లో పార్టీ బలోపేతం కాలేదని చెప్పారు. 2019 ఎన్నికల తరువాత పార్టీ యాక్టివిటీ పెంచడం, కార్యకర్తల సంక్షేమం చూడడం, ఇతర కార్యక్రమాల కారణంగా మంచి మార్పు కనిపిస్తుందని చంద్రబాబు అన్నారు. అయితే దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని, తిరుగు లేని విజయంతో మంగళగిరిలో కొత్త చరిత్ర రాయాలని ఇంచార్జ్ లోకేష్ కు పార్టీ అధినేత సూచించారు.
నాలుగు నియోజవర్గాల ఇంచార్జ్లతో ముఖాముఖీ భేటీలు జరిగాయి. కర్నూలు ఇంచార్జ్ టిజి భరత్, ఇచ్చాపురం ఇంచార్జ్ బెందాళం అశోక్ రివ్యూలకు హాజరయ్యారు. ఇప్పటికి మొత్తం 111 నియోజకవర్గాల ఇంచార్జ్ లతో ముఖాముఖి సమీక్షలు ముగిశాయి.