ఆయన్ని ఫుల్లుగా వాడుకుంటానంటున్న చంద్రబాబు..
posted on Jan 30, 2016 @ 11:08AM
కష్టపడి పనిచేసే తత్వం ఉన్నవాళ్లకి ఎక్కడికెళ్లినా ప్రశంసలు వాటంతట అవే వస్తాయి. అలాంటిది ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి చేతే అలాంటి ప్రశంసలు అందితే ఇంకేలా ఉంటది. అలాంటిదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఐవైఆర్ కృష్ణారావు విషయంలో జరిగింది. ఐవైఆర్ కృష్ణారావు ఈ నెల 31న రిటైర్ కానున్నారు. అయితే గతంలో చంద్రబాబు ఒకసారి ఆయన గురించి మాట్లాడుతూ ఆయన రిటైర్ అయినా.. ఆయన్ను పూర్తిగా వాడేస్తామంటూ చెప్పారు. ఆయన చెప్పినట్టు ఇప్పుడు అదే జరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఆయనను వదులుకోవడం ఇష్టంలేని ఏపీ ప్రభుత్వం ఇటీవలే ఆయనకు బ్రాహ్మణ కార్పొరేషన్ కు ఛైర్మన్ గా.. దేవాదాయ అర్చకులు.. ఉద్యోగుల సంక్షేమ నిధి ట్రస్టుకు ఐవైఆర్ ను ఛైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో రిటైర్డ్ అయినా కూడా ఐవైఆర్ కృష్ణారావు ఈ జంట పదవులతో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. మొత్తానికి ఐవైఆర్ కృష్ణారావు ను పూర్తిగా వాడుకుంటామన్న ప్రభుత్వం అనుకున్న పనిచేసింది.