తెదేపాకు కలిసి వచ్చిన అంశాలు ఏమిటి?
posted on May 8, 2014 @ 4:24PM
ఆంద్ర, తెలంగాణాలలో ఎన్నికలు పూర్తయిపోయాయి. తెలంగాణాలో తెరాసకు కొంత ఆధిక్యత వచ్చి న్నప్పటికీ, అక్కడ సంకీర్ణ ప్రభుత్వం తప్పకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తునన్నారు. ఇక ఆంద్ర విషయానికి వస్తే తెలుగుదేశం, వైకాపాల మధ్య జరిగిన హోరాహోరీగా పోటీలో తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. కారణం తెదేపా పటించిన అభివృద్ధి, సంక్షేమ మంత్రాలే. పట్టణాలలో ప్రజలను చంద్రబాబు చెప్పిన సుస్థిర ప్రభుత్వం, అభివృద్ధి, సింగపూరు వంటి ఆధునిక రాజధాని నిర్మాణం వంటివి విపరీతంగా ఆకట్టుకోనగా, ఆయన ప్రకటించిన ఋణాల మాఫీ, సంక్షేమ పధకాలు, ఇతరత్రాలు గ్రామీణులను ఆకర్షించాయి.
ఇక చంద్రబాబుకి మరికొన్ని అంశాలు కూడా బాగా కలిసివచ్చాయి.
1. కొమ్ములు తిరిగిన కాంగ్రెస్ ఈ ఎన్నికలలో పూర్తిగా డ్డీలా పడిపోవడం. ఆ పార్టీ నుండి హేమాహేమీలు తెదేపాలోకి వచ్చి చేరడం.
2. రాష్ట్ర విభజన కారణంగా ప్రజలలో కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేఖత ఏర్పడి ఉండటం. తన ప్రధాన రాజకీయ ప్రత్యర్ధి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంతో రహస్య అవగాహన కలిగి ఉండటం.
3. జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి పరిపాలనానుభవం లేకపోవడం. అతనిపై అనేక సీబీఐ, ఈడీ కేసులు, అవినీతి ఆరోపణలు కలిగి ఉండటం. చంద్రబాబు పరిపాలనానుభావం అనుభవం, దక్షత, కేంద్రంతో సత్సంబంధాలు కలిగి ఉండటం.
4. విజయావకాశాలు గల బీజేపీతో ఎన్నికల పొత్తులు. మోడీతో ఆయనకున్న సాన్నిహిత్యం. మోడీ, పవన్ కళ్యాణ్ ప్రచారం, ప్రజలపై వారి ప్రభావం.