చంద్రబాబు ప్రాధాన్యతలు ఏమిటి?
posted on May 8, 2014 @ 4:39PM
ఈ ఎన్నికలలో రాష్ట్రంలో చంద్రబాబు, కేంద్రంలో నరేంద్ర మోడీ కనుక అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ చంద్రబాబు ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపడితే ఆయన ప్రాధాన్యతలు ఏవిధంగా ఉండవచ్చునో ఒకసారి చూద్దాము.
1. మొట్ట మొదట కేంద్రంలో మోడీ నేతృత్వంలో బీజేపీ అధికారంలో స్థిరపడేందుకు అవసరమయిన మద్దతు కూడగట్టవచ్చును.
2. కొత్త రాజధాని గుర్తింపు ప్రక్రియ పూర్తి కాగానే వీలయినంత త్వరగా ముఖ్యమయిన ప్రభుత్వ కార్యాలయాలను యుద్దప్రాతిపదికన నిర్మించి ప్రభుత్వపాలన రాష్ట్రం నుండే చేసేందుకు అవసరమయిన చర్యలు తీసుకోవచ్చును. అవసరమయితే ముందుగా కొన్ని కార్యాలయాలను రాష్ట్రంలో లభ్యమయ్యే భవనాలలోకి మార్చినా మార్చవచ్చును.
3. గాడి తప్పిన పరిపాలనను మళ్ళీ గాడిలో పెట్టేందుకు అవసరమయిన అని చర్యలు యుద్దప్రాతిపాదికన చెప్పట్టవచ్చు.ఆర్ధిక లోటుని భర్తీ చేసుకొనేందుకు గాను కేంద్రం నుండి భారీ నిధులు తెచ్చేందుకు కృషి చేస్తూనే, తనకున్నపరిచయాలతో సాఫ్ట్ వేర్ కంపెనీలను, పారిశ్రామిక వేత్తలను రాష్ట్రానికి రప్పించవచ్చు. ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తి, మౌలిక సదుపాయాలూ, నిర్మాణ రంగాలకు చెందిన పరిశ్రమలకు పెద్ద పీట వేయవచ్చును.
4. నష్టాల ఊబిలో కూరుకుపోయున్న ఆర్టీసీ, చేనేత వంటి అనేక సంస్థలను గాడిన పెట్టె ప్రయత్నం చేయవచ్చు.
5. ఇదివరకు వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ప్రభుత్వోద్యోగులను నిర్లక్ష్యం చేసినందున చాలా భారీ మూల్యం చెల్లించ వలసి వచ్చింది గనుక ఈసారి చంద్రబాబు అధికారంలోకి వస్తే ఈ మూడు అంశాలపై కూడా ప్రత్యేక శ్రద్ద పెట్టడం తధ్యం.