జగన్ అప్పుల గుట్టు బయటపెట్టిన కేంద్రం
posted on Jul 26, 2022 @ 4:23PM
కొడుకుని బాగా చదివించి మంచి ఉద్యోగంలో పెడితే, సరదాలకు అప్పులు చేసి తండ్రికి దొరికి పోయాడు. ఒకానొక పండుగ రోజు అందరిముందూ చిట్టావిప్పి ప్రశ్నించాడు. అదుగో అలా వుంది ప్రస్తుతం జగన్ పరిస్థితి. కేంద్రం ఇక వైసీపీ స్నేహ యాత్రకు ఫుల్‌స్టాప్ పెట్టినట్టే.
వైసీపీ సర్కార్ ఎవరు అప్పులు ఇస్తారోనని ఎదురుచూసే దుకాణంలా మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల గురించి పార్లమెంటులో ప్రస్తావిస్తూ, కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌చౌదరి, ఈ ఆర్ధిక సంవత్సరం అనుమతించిన అప్పుల్లో అప్పుడే ఏపీ సగానికి పైగా రుణాలు తీసేసుకుం దన్నారు.
టీడీపీ ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి లిఖిత పూర్వక సమాధానంలో కేం ద్రం, నాబార్డు నుంచీ కూడా జగన్ సర్కారు రుణాలు పొందిందని పంకజ్ చౌదరి వెల్లడించారు.
2022-23లో నికర రుణ పరిమితి కింద ఏపీకి రూ.44,574 కోట్ల రుణానికి కేంద్రం అనుమతిచ్చింది. మొదటి తొమ్మిదినెలలకు రూ.40,803 కోట్ల రుణం తీసుకునేందుకు అనుమతి ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊహించని విధంగా అతి తక్కువ సమయంలోనే ఆరుణాన్ని తీసుకుందని రాజ్యసభలో కేంద్రం వెల్లడిం చింది. ఏప్రిల్ నాటికే రూ.21,890 కోట్ల రుణం తీసుకున్నట్లు తెలిపింది. కేంద్రం నుంచి మరో రూ.1,373.47 కోట్లను ఏపీ రుణంగా తీసుకుంది. అప్పు పుట్టిన ప్రతిచోటా ఏపీ రుణాలు తీసుకుం టున్నట్లు కేంద్రం కొస మెరుపుగా పేర్కొంది.