చంద్రబాబు ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
posted on Aug 23, 2025 @ 9:35AM
దేశంలోనే అత్యంత సంపన్న సీఎంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిలిచారు. దేశంలోని ముఖ్యమంత్రుల్లో అందరికంటే చంద్రబాబు ఆస్తుల విలువే అధికమని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్ల్యు) సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక పేర్కొంది. చంద్రబాబు ఆస్తుల విలువ రూ.931 కోట్లుగా ఆ నివేదిక పేర్కొంది. చంద్రబాబు తరువాతి స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమాఖండూ రూ.332 కోట్ల విలువైన ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నారు. ఇక ఈ నివేదిక ప్రకారం కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య రూ. 51 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో నిలిచారు.
ఎన్నికల సమయంలో అభ్యర్థులు తమ నామినేషన్లతో పాటు సమర్పించే అఫిడవిట్ల ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. ఇక ఆదే నివేదిక దేశవ్యాప్తంగా 12 మంది ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసుల వివరాలను కూడా పేర్కొంది. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిపై అత్యధికంగా 89 క్రిమినల్ కేసులతో ఈ నివేదికలో తొలి స్థానంలో నిలిచారు. ఇక తమిళనాడు సీఎం స్టాలిన్ పై 47 కేసులతో రెండో స్థానంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ జాబితాలో 19 కేసులతో మూడో స్థానంలో ఉన్నారు.